News December 8, 2024

పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా: ఆర్జీవీ

image

దేశంలోని థియేటర్లలో ‘పుష్ప-2’ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌పై పరోక్షంగా దర్శకుడు ఆర్జీవీ సెటైర్లు వేశారు. ‘బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్‌గా డబ్బింగ్ చిత్రం ‘పుష్ప-2’ నిలిచింది. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిందీ నటుడు ఆ భాష మాట్లాడలేని తెలుగు యాక్టర్ అల్లు అర్జున్. ఇకపై పాన్ ఇండియా కాదు. ఇది తెలుగు ఇండియా’ అని తనదైన స్టైల్‌లో Xలో రాసుకొచ్చారు.

News December 8, 2024

రేవంత్ తనకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నారు: ఈటల

image

TG: ప్రజల అంచనాలను చేరుకుంటే తప్ప పార్టీల మనుగడ కొనసాగదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవిపై తనకు సమాచారం లేదని చెప్పారు. రాజకీయనేతగా ఏ పార్టీలోనైనా ఉండగలనని తెలిపారు. రేవంత్ తనకు సీఎంగా వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నారని అన్నారు. రాజకీయాలు ప్రజాసేవ కోసమన్నది తన ఫిలాసఫీ అని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు లేని పార్టీ ఉండదన్నారు.

News December 8, 2024

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు.

News December 8, 2024

పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

News December 8, 2024

సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. ఇంగ్లండ్ ప్లేయర్ రికార్డ్

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఓ సెంచరీ, హ్యాట్రిక్, ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. కేవలం 10 టెస్టుల్లోనే అతను ఈ ఫీట్ నమోదు చేశారు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ 26 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు.

News December 8, 2024

విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు: బుద్దా వెంకన్న

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత <<14819228>>బుద్దా వెంకన్న<<>> పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే VSRను అరెస్టు చేయాలని కోరారు. కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

News December 8, 2024

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

అండర్-19 ఆసియా‌కప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను 198 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టులో రిజాన్(47), జేమ్స్(40), ఫైజల్(39) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో యుధజిత్, చేతన్, హర్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కార్తికేయ, ఆయుశ్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 199.

News December 8, 2024

టీఫైబర్ సేవలు ప్రారంభించిన శ్రీధర్ బాబు

image

TG: టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 20Mbps వేగంతో నెలకు రూ.300కే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించనున్నారు. మొబైల్, కంప్యూటర్, టీవీకి వినియోగించవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో పాటు మీసేవ మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 150కి పైగా పౌర సేవలు అందించనున్నారు.

News December 8, 2024

WTC: మూడో స్థానానికి భారత జట్టు

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. అడిలైడ్ టెస్ట్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (60.71%) టాప్‌కు వెళ్లింది. ఒకటో స్థానంలో ఉన్న భారత్ (57.29%) మూడో స్థానానికి వచ్చింది. సౌతాఫ్రికా (59.26%) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. BGTలో మిగతా 3 టెస్టులు గెలవకపోతే ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

News December 8, 2024

హిందీ గడ్డపై పుష్ప-2 సరికొత్త రికార్డు

image

పుష్ప-2 బాలీవుడ్‌లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే ₹205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జవాన్(₹180Cr), యానిమల్(₹176Cr), పఠాన్(₹161Cr) సినిమాలను అల్లు అర్జున్ వెనక్కు నెట్టారు. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు ₹70Cr మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం ₹72Cr, శుక్రవారం ₹59Cr, శనివారం ₹74Cr సాధించింది.