News September 12, 2024

నేను డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

image

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్‌పై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని అన్నారు. ‘డ్రగ్స్ రిపోర్టులో నెగటివ్ అని ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నట్లు నాకు సమాచారం ఉంది. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరును అందులో చేర్చారు’ అని ఆమె తాజాగా మీడియాకు తెలిపారు. ఛార్జ్ షీట్‌ తన చేతికొచ్చాక మళ్లీ స్పందిస్తానన్నారు.

News September 12, 2024

ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ

image

టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ గౌడ్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కుటుంబ సమేతంగా కలిశారు. ఆయనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈనెల 15న టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకోనున్నారు.

News September 12, 2024

వైసీపీకి భారీ షాక్?

image

AP: ప్రకాశం జిల్లాలో YCPకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిన్న జగన్‌తో జరిగిన చర్చలూ అసంతృప్తిగానే ముగిసినట్లు సమాచారం. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరుతారనే ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్‌తో ఆయనకి మంచి సంబంధాలుండటంతో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.

News September 12, 2024

9 మంది జడ్జిలిచ్చిన తీర్పుపై రివ్యూ కోరిన కేంద్రం

image

మైనింగ్, మెటల్ కంపెనీలు ఆయా రాష్ట్రాలకు <<13708414>>రాయల్టీ<<>> చెల్లించాలంటూ 9 మంది జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్రం, Pvt కంపెనీలు రివ్యూ కోరాయి. తీర్పులో కొన్ని తప్పులు ఉన్నాయన్నాయి. మధ్యప్రదేశ్‌‌ కో-పిటిషనర్‌గా ఉంది. ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశమని, ఓపెన్ కోర్టులో విచారించాలని కేంద్రం కోరింది. ప్రజా ప్రయోజనం దాగున్న ఈ పిటిషన్ను ఓరల్ హియరింగ్‌కు అనుమతించకపోతే అన్యాయమే అవుతుందని పేర్కొంది.

News September 12, 2024

‘దేవర’పై ట్రోల్స్.. విశ్వక్‌సేన్ స్ట్రాంగ్ రిప్లై

image

‘దేవర’ ట్రైలర్ తనకు చూడాలి అనిపించలేదని, అందులో ఎన్టీఆర్ బాలేడని విశ్వక్‌సేన అనే ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చేశారు. తన అభిమాన హీరోని ఇలా అనేసరికి హీరో విశ్వక్ సేన్ సీరియస్ అయ్యారు. ‘నాపేరు కరాబ్ చేయడానికే వీడు పుట్టాడు. ముందు గోడ సపోర్ట్ లేకుండా కూర్చో. తర్వాత సినిమా, ఆడియన్స్‌ని ఉద్దరిద్దువు. కాలుతుంది నాకు. కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది. నువ్వే మాట్లాడాలి అందం గురించి’ అని కౌంటర్ ఇచ్చారు.

News September 12, 2024

ముంబైకి రోహిత్ గుడ్‌బై?

image

IPL మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో రోహిత్ జట్టు మారడం ఖాయమని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చారు. ‘ముంబై అతడిని అంటిపెట్టుకోదు. శర్మ కూడా వీడాలనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే వేలానికి రాకుండా మరో ఫ్రాంచైజీకి అతడిని ట్రేడ్ చేసే ఛాన్సుంది. ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసిందనుకుంటున్నా’ అని అన్నారు. మరి రోహిత్ MIను వీడుతారని మీరు భావిస్తున్నారా?

News September 12, 2024

కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్ ఆస్తులివే..

image

కాంగ్రెస్ జులనా అభ్యర్థి <<14076884>>వినేశ్ ఫొగట్<<>> తన వద్ద వోల్వో XC 60 (Rs 35L), హ్యుండాయ్ క్రెటా, ఇన్నోవా కార్లు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇన్నోవా కోసం ఆమె రూ.13 లక్షల లోన్ తీసుకొని EMIలు చెల్లిస్తున్నారు. సోనిపత్‌లో రూ.2 కోట్ల విలువైన ప్లాట్ ఉంది. చేతిలో రూ.1.95 లక్షల నగదు ఉంది. గత FYలో రూ.13,85,000 ఆదాయం వచ్చినట్టు ఐటీ రిటర్నుల్లో పేర్కొన్నారు. ఆమె భర్త సోంవీర్ వద్ద మహీంద్రా స్కార్పియో ఉంది.

News September 12, 2024

విధి రాత.. శ్రుతి ప్రేమ కథలో విషాదం

image

వయనాడ్ బాధితురాలు <<13985686>>శ్రుతి<<>> జీవితంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె ప్రియుడు జాన్సన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన నడుపుతున్న ఓమ్నీ వ్యాన్‌ను బస్ ఢీకొట్టడంతో జాన్సన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో శ్రుతి కాలికి కూడా గాయాలయ్యాయి. కాగా గత నెలలో వయనాడ్‌లో సంభవించిన వరదల్లో ఆమె తండ్రి, తల్లి, చెల్లితో పాటు మరో ఆరుగురు బంధువులు మరణించిన సంగతి తెలిసిందే.

News September 12, 2024

బ్రోకరిజానికి అరికెపూడి నిదర్శనం: MLA కౌశిక్

image

TG: అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, కాదా అనేది ఆయన స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఆయన టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. బ్రోకరిజానికి ఆయన నిదర్శనం’ అని అన్నారు. ‘కేసీఆర్‌ను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం రేవంత్ అన్నారు. అందుకే నేను పార్టీ మారిన ఎమ్మెల్యేలను <<14075305>>చీరలు<<>>, గాజులు వేసుకోవాలని అన్నాను’ అని స్పష్టం చేశారు.

News September 12, 2024

ALERT.. ఈ జిల్లాలో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.