News December 8, 2024
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అక్కడి పార్టీలు జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధ్యక్షుడి సైనిక పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ను తొలగించేందుకు అధికార పీపుల్స్ పవర్ పార్టీ (PPP), విపక్ష డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే శనివారం ఓటింగ్ సందర్భంగా PPP సభ్యులు అనూహ్యంగా బాయ్‌కాట్ చేయడంతో తీర్మానం వీగిపోయింది.
Similar News
News January 21, 2025
12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో 12 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్వీసీ, మైత్రీ, వృద్ధి సినిమాస్‌లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం 8 చోట్ల 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు శిరీష్, కుమార్తె నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు.
News January 21, 2025
IOC ప్రెసిడెంట్‌తో ICC ఛైర్మన్ జై షా
ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్‌తో ఐసీసీ ఛైర్మన్ జై షా న్యూజిలాండ్‌లో మరోసారి సమావేశమయ్యారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లోనే క్రికెట్‌ను చేర్చాలని జై షా పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆస్ట్రేలియాలోనూ 2032 బ్రిస్బేన్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌తో జై షా భేటీ అయ్యారు.
News January 21, 2025
‘నా భార్య టార్చర్ పెడుతోంది.. చనిపోతున్నా’
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్(MP)కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. ‘మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని తెలిపాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని పేర్కొన్నాడు.