India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించే క్రమంలో ఆయనతో ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. గులాబీ బాస్ కోరిక మేరకు లంచ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్‌ను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్‌లో ఉండే సల్ఫారఫేన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడంలో సాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. స్ట్రా బెర్రీ, బ్లూబెర్రీస్, రాస్‌బెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ డ్యామేజ్డ్ కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పసుపులో ఉండే కర్కుమిన్ కాంపౌండ్ క్యాన్సర్ సెల్స్ వృద్ధిని నిలిపివేస్తాయని సలహా ఇస్తున్నారు.

<<14808552>>తన పేరిట ప్రచారంలో ఉన్న వీడియో<<>> తనది కాదని నటి ప్రగ్యా నగ్రా ట్విటర్లో తెలిపారు. ‘మళ్లీ చెబుతున్నా. ఆ వీడియో నాది కాదు. ఇదో పీడకల అయితే బాగుండేది. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి తప్ప దుర్భరం చేయకూడదు. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలేస్తోంది. నాకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు’ అని సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు.

క్రికెటర్ పృథ్వీ షాపై విమర్శలు అన్యాయమని అతడి చిన్ననాటి కోచ్ రాజు పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారిది చాలా పేద కుటుంబం. పృథ్వీ చాలా కష్టపడ్డాడు. మంచీచెడూ చెప్పేందుకు తల్లి లేదు. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. రోజు ఎలా గడవాలన్న స్థితి నుంచి ఒక్కసారిగా డబ్బు వచ్చిపడటంతో లైఫ్‌ను ఎంజాయ్ చేశాడు. కానీ పాతికేళ్ల కుర్రాడు 40 ఏళ్లవాడిలా ప్రవర్తించాలని అందరూ కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల సరళిని మార్చాలని డిమాండ్ చేస్తూ పోటీ పరీక్షల ఆశావహులు ఆందోళనకు దిగారు. Dec 13న BPSC నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షల్లో ఒక పూట ఒకే పేపర్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఖాన్, రెహ్మాన్ ఖాన్ వంటి కొందరు ప్రముఖ విద్యావేత్తలు మద్దతుపలికారు. ఆందోళనకారులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడం వివాదాస్పదమైంది.

AP: తాను వచ్చే వారం TDPలో చేరనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే YCPకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం TDP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నెల 5న విడుదలైన ‘పుష్ప-2’లో రష్మిక నటన, డాన్స్‌తో అదరగొట్టారని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ రష్మికకు మంచి హిట్ ఇచ్చింది. గత ఏడాది ‘యానిమల్’ మూవీ కూడా ఇదే నెలలో విడుదలై రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో గీతాంజలి పాత్రలో ఈ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో రష్మికకు డిసెంబర్ మాసం కలిసొచ్చిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మహావికాస్ అఘాడీ(MVA) నుంచి తప్పుకొంటున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిలింద్ నర్వేకర్ బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించేలా ట్వీట్ చేయడమే దీనిక్కారణమని మహారాష్ట్ర SP అధ్యక్షుడు అబు అసీం అజ్మీ తెలిపారు. శివసేన(UBT) సైతం బాబ్రీ కూల్చివేతకు మద్దతిచ్చేలా పేపర్‌లో ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.

భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్(140) సెంచరీతో రాణించారు. బుమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 180 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ‘నితీశ్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. పరిస్థితులకు తగ్గట్టుగా సరైన సమయంలో ఎదురుదాడి చేశారు. భారత క్రికెట్‌కు మున్ముందు మంచి ఆటగాడవుతారు. వయసు 22 ఏళ్లే అయినా ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేశారు. ఆ రివర్స్ స్కూప్ షాట్ అద్భుతం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.