News December 7, 2024

వచ్చే వారం టీడీపీలో చేరుతా: వాసిరెడ్డి పద్మ

image

AP: తాను వచ్చే వారం TDPలో చేరనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే YCPకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం TDP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

Similar News

News January 21, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 21, 2025

శుభ ముహూర్తం (21-01-2025)

image

✒ తిథి: బహుళ సప్తమి ఉ.11.06 వరకు ✒ నక్షత్రం: చిత్త రా.10.30 వరకు ✒ శుభ సమయం: ఏమీ లేవు ✒ రాహుకాలం: మ.3.00-4.30 వరకు ✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు ✒ దుర్ముహూర్తం: 1. ఉ.8.24-9.12 వరకు 2.రా.10.46-11.36 వరకు ✒ వర్జ్యం: తె.4.39-6.25 వరకు ✒ అమృత ఘడియలు: మ.3.22-5.08 వరకు

News January 21, 2025

GTA6: ఆడాలంటే రూ.9 వేలు

image

90s కిడ్స్ ఫేవరెట్ కంప్యూటర్ వీడియో గేమ్స్‌లో ఒకటైన GTA 6 వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది. కొత్త ఎడిషన్ గేమ్‌కు రాక్‌స్టార్ $100 (దాదాపు రూ.9000) ఛార్జ్ చేయొచ్చని గేమ్ అనలిస్ట్ మ్యాథ్యూ బాల్ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, పెరిగిన R&D, క్రియేటివ్ కంటెంట్ ఖర్చుల వల్ల ఆ సంస్థ ఈ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకీ మీలో ఎంతమంది Grand Theft Auto (GTA) ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేయండి.