News September 11, 2024

రాహుల్.. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను రద్దు చేయలేరు: షా

image

రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారని HM అమిత్ షా అన్నారు. BJP ఉన్నంత వరకు ఎవరూ వాటిని రద్దు చేయలేరని, జాతి భద్రతకు విఘాతం కలిగించలేరని తెలిపారు. ‘దేశ విభజనకు కుట్రలు చేసేవారికి (JKNC) మద్దతివ్వడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారాయి. భాష, మతం, ప్రాంతం పేరుతో ఆయన చిచ్చు పెడుతున్నారు’ అని విమర్శించారు.

News September 11, 2024

కేంద్రం, IOA చీఫ్ నాకు సపోర్ట్ ఇవ్వలేదు: వినేశ్ ఫొగట్

image

పారిస్ ఒలింపిక్స్ సమయంలో IOA చీఫ్ పీటీ ఉష నుంచి తనకు సపోర్ట్ లభించలేదని రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆరోపించారు. ‘ఆమె ఆస్పత్రికి వచ్చి ఓ ఫొటో తీసుకుని వెళ్లారు. అక్కడ కూడా పాలిటిక్స్ జరిగాయి. అందుకే నా గుండె పగిలింది. మెడల్ కోసం CASలో పిటిషన్ కూడా నేనే వేశాను. ప్రభుత్వం బాధ్యత మరిచి థర్డ్ పార్టీగా వ్యవహరించింది’ అని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

News September 11, 2024

మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?

image

గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరోసారి ఈ కాంబోలో చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. బాబీ, బోయపాటితో బాలయ్య సినిమాలు పూర్తయ్యాక ఈ మూవీ ఉంటుందని టాక్. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. దీనిపై వచ్చే ఏడాది ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News September 11, 2024

BREAKING: జగన్ పాస్‌పోర్టు రెన్యూవల్‌కు హైకోర్టు ఆదేశం

image

AP: తన పాస్‌పోర్టు రెన్యూవల్ చేసేలా ఆదేశాలివ్వాలని వైసీపీ చీఫ్ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సంవత్సరాలకు పాస్‌పోర్టు రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన రూ.25వేల పూచీకత్తు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

News September 11, 2024

రుణమాఫీ సర్వే 50% పూర్తి.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని 4.24 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

News September 11, 2024

టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్

image

TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

News September 11, 2024

కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు

image

TG: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని వివరించారు.

News September 11, 2024

స్టార్ హీరో విడాకులు.. భార్య షాకింగ్ కామెంట్స్

image

తమిళ హీరో జయం రవి <<14058198>>విడాకులు<<>> తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య ఆర్తి రవి విచారం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే ఈ ప్రకటన చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నా అవకాశం లేకపోయిందని వాపోయారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడుతానని చెప్పారు.

News September 11, 2024

20 కి.మీ వరకూ నో టోల్.. ఇలా!

image

జాతీయ రహదారులపై 20 కి.మీ. వరకూ ఎలాంటి <<14068203>>టోల్<<>> ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదారులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

News September 11, 2024

ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం!

image

క్రికెట్ ప్రేమికులకో పజిల్. పై ఫొటోలో ఓ లెజెండరీ బౌలర్ ఉన్నారు. వన్డేల్లో 300కి పైగా మెయిడిన్ ఓవర్లు వేసిన ఒకే ఒక క్రికెటర్ అతడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు, 13 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. IPLలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి.
**సరైన సమాధానం మ.ఒంటి గంటకు ఇదే ఆర్టికల్‌లో చూడండి.