News September 11, 2024

ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా?

image

డబ్బులు చెల్లించి OTTలో కాకుండా వివిధ అక్రమ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లను డౌన్‌లోడ్ చేసుకుని చూడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రేక్షకులు, అటు పైరసీ చేసేవారు పన్ను ఎగవేస్తుండటంతో భారత్ భారీగా ఆదాయం కోల్పోతోంది. అంతేకాదు యూజర్ల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌కు అమ్మేస్తున్నట్లు తేలింది. ఆ ఆదాయాన్ని మానవ, ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

News September 11, 2024

‘దేవర’ నుంచి మరో ట్రైలర్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News September 11, 2024

నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్

image

AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.

News September 11, 2024

పాకిస్థాన్ కాల్పులు.. BSF జవానుకు గాయాలు

image

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని BSF వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2.35 గంటలకు సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులకు తెగబడిందని తెలిపింది. దీనికి BSF జవాన్లు దీటుగా జవాబిచ్చారని, ఒక జవానుకు గాయాలు అయ్యాయని పేర్కొంది. సైనికులందరూ హై అలర్ట్‌గా ఉన్నారని వివరించింది.

News September 11, 2024

ఆధార్ అప్‌డేట్ చేసుకోండి..

image

ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. లేదంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంటి నుంచే UIDAI పోర్టల్‌లో ఆధార్, OTPతో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోయినా అది పని చేస్తుందని UIDAI తెలిపింది. పూర్తి ప్రాసెస్ కోసం ఇక్కడ <<13946053>>క్లిక్<<>> చేయండి.

News September 11, 2024

టెట్ అభ్యర్థులకు మరో అవకాశం

image

TG: టెట్‌లో మార్కులు, హాల్ టికెట్, ఇతర వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇవ్వనుంది. డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని కోరుతున్నారు. ఇవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇస్తే సమస్యలొస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండు రోజులపాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. దీనిపై నేడు లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశముంది.

News September 11, 2024

అప్పుడు మోడల్.. ఇప్పుడు మేడమ్

image

యూపీలోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి మోడల్‌గా ఎదిగి ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో డిగ్రీ చదివే సమయంలో ఆమె కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అది చూసిన కొన్ని సంస్థలు ఆమెకు మోడలింగ్ అవకాశమిచ్చాయి. ఆ తర్వాత మోడలింగ్‌ను పక్కనపెట్టి 2022లో సివిల్స్ ఫలితాల్లో 116వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఇన్‌స్టాలో ఆమెకు 271K ఫాలోవర్లు ఉన్నారు.

News September 11, 2024

ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?

image

ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.

News September 11, 2024

ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు

image

ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.

News September 11, 2024

వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?

image

చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.