News December 7, 2024
మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి: దక్షిణ కొరియా ప్రెసిడెంట్
దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ క్షమాపణ చెప్పారు. తన అభిశంసన తీర్మానంపై ఓటింగుకు ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మిమ్మల్ని ఆందోళన, అసంతృప్తికి గురిచేసినందుకు క్షమించండి. మరోసారి మార్షల్ లా కోసం ప్రయత్నించను. నా భవిష్యత్తును ఇక పార్టీయే నిర్ణయిస్తుంది. ఎలాంటి న్యాయ, రాజకీయ పరిణామాలకైనా నేను సిద్ధమే’ అని అన్నారు. ఆయన చర్యల్ని ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష సభ్యులూ వ్యతిరేకించారు.
Similar News
News January 24, 2025
కొత్తగూడెం, సాగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు స్థలాల పరిశీలన
TG: కొత్తగూడెం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట, రామవరం ప్రాంతాల్లో 950 ఎకరాలు, సాగర్ సమీపంలోని ఏపీ వైపు విజయపురి సౌత్ వద్ద 1600 ఎకరాల భూములను చెక్ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
News January 24, 2025
పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’
AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.
News January 24, 2025
త్వరలో RTCలో నియామకాలు: మంత్రి
TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.