India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైద్యుల సర్వీసు కోటాను 30% నుంచి 15శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO 85కి వ్యతిరేకంగా PHCల్లోని వైద్యులు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. తొలిరోజు నల్లబ్యాడ్జీలు ధరిస్తామని, 11, 12న వైద్యసేవలకు అంతరాయం లేకుండా నిరసన కొనసాగిస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. 13 నాటికి అత్యవసర మినహా అన్ని సేవలు నిలిపివేస్తామన్నారు. 15న చలో విజయవాడ, 16 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: విశాఖకు మరో వందే భారత్ రైలును నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది.
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.
టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సముద్రాల్లోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకొంటూ సముద్రంలో చేరుతుంది. నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు. కానీ సాగరాల్లో లవణాలు ఎటూ పోయే దారి ఉండదు. అటు సముద్రాల అడుగున భూమి పొరల నుంచి కూడా లవణాలు అందులో కలుస్తుండటంతో ఆ నీరు ఉప్పగా ఉంటుంది.
పండుగల సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పాపులర్ కార్లు, SUVలపై రూ.2.05 లక్షల వరకూ ధరలు తగ్గించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే డీలర్ వద్ద ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.45వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అన్ని రకాల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ కార్లపైనా ధరల తగ్గింపు ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది.
Sorry, no posts matched your criteria.