India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణం చేసిన అనంతరం వీరు ప్రమాణం చేశారు. భారీ ఎత్తున జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

సమర్థ నాయకుడిగా పేరొందిన దేవేంద్ర ఫడణవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ABVPతో రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. 1992లో నాగ్‌పూర్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికైన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కారు. 1999లో నాగ్‌పూర్ సౌత్-వెస్ట్ MLAగా గెలిచారు. ఐదుసార్లు ఓటమెరుగలేదు. 2014లో మొదటిసారి CM అయ్యారు. 2019లో 2వసారి CMగా ప్రమాణం చేసినా అనంతర పరిణామాలతో 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.

TG: తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు CM రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా విజయోత్సవాల్లో TGSRTCలో కారుణ్య ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. గత పాలనలో RTCకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తాము ఆర్టీసీని అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నట్లు చెప్పారు. రవాణా శాఖ కొత్త లోగో TGTDతో పాటు శాఖ విజయాలపై బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు.

డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో తమిళనాడులో అరెస్టైన ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. అతడు డ్రగ్స్ వాడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. చెన్నైలోని పలు కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించే ఓ డీలర్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరు కోర్టు అలీ ఖాన్ సహా ఏడుగురికి 15 రోజుల రిమాండ్ విధించింది.

పీఎస్ఎల్‌వీ-సీ59 ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తలు, ప్రోబా బృందాన్ని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ అభినందించారు. రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ప్రోబా తదుపరి ప్రయోగాలకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ ప్రయోగం విజయవంతంతో మరిన్ని విభిన్న ప్రయోగాలకు వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నెలలో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్‌వీ-సీ60 ప్రయోగం చేపడుతామని పేర్కొన్నారు.

AP: జనవరి మూడో వారం నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు (బుధ, గురువారం) పర్యటించి అక్కడే బస చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో మమేకం అవుతానన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని నేతలకు సూచించారు.

AP: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో గూగుల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతో పాటు స్టార్టప్‌లు, సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది.

TG: ప్రజలు ఎన్నుకున్న తొలి ప్రభుత్వాన్ని(టీఆర్ఎస్) ఏడాది కాకుండానే డబ్బు సంచులతో రేవంత్ కూల్చే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు చెబుతున్నారని X వేదికగా దుయ్యబట్టారు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణమన్నారు. ఊసరవెల్లి కూడా రేవంత్‌ను చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని పేర్కొన్నారు.

సూర్యుడి లోపలి భాగమైన కరోనా గుట్టును ఛేదించడమే ప్రోబా-3 ముఖ్యోద్దేశం. PSLV C-59 రాకెట్‌లో 310 KGల కరోనాగ్రాఫ్, 240 KGల ఆకల్టర్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. కక్ష్యలోకి చేరాక ఈ రెండు ఉపగ్రహాలు విడిపోతాయి. ఆకల్టర్ ఉపగ్రహ నీడలో పయనిస్తూ కరోనాగ్రాఫ్ కక్ష్యలో కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించి సూర్యుడిలోని కరోనాను అధ్యయనం చేస్తుంది.

శ్రీహరికోటలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C59 ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలను ISRO కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.