India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ పారాలింపిక్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్ల టీమ్‌ను జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా అభినందించారు. ‘2024 పారాలింపిక్స్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 29 పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన టీమ్‌లో ఉన్న భారత అథ్లెట్ల బృందానికి, సహాయక సిబ్బందికి నా అభినందనలు. మిమ్మల్ని చూసి ఇండియా గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు. నీరజ్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
TG: పార్టీ ఫిరాయించిన MLAల అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది. BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని BRS, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యులు విధులు బహిష్కరించడం వల్ల 23 మంది మృతి చెందినట్టు బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా దర్యాప్తు పురోగతిపై సీబీఐ నివేదిక సమర్పించింది. ముందుగా ఈ నివేదికను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.
తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళోజీ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన రచనలు నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలని అన్నారు. ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని కోటాలో 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం నుంచి వైద్యులు ఏకంగా 6,110 రాళ్లను తొలగించారు. మూడురోజుల క్రితం రోగి సోనోగ్రఫీని చేయించుకోగా పిత్తాశయం రాళ్లతో నిండిపోయి 12×4 సెం.మీల పరిణామంతో కనిపించింది. దీంతో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం సవాలుగా మారిందని, ఎండోబ్యాగ్ని ఉపయోగించి పిత్తాశయం తొలగించినట్లు వైద్యులు తెలిపారు. 30- 40 నిమిషాల పాటు శస్త్ర చికిత్స చేసి రోగిని డిశ్చార్జ్ చేశారు.
AP: విజయవాడను మరోసారి వరద ముప్పు ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో బుడమేరు పరివాహ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందన్నారు.
అత్యుత్తమ చదువులకు ఆలయాలుగా భావించే IITల్లో చదివినా చాలామందికి తక్కువ వేతనాలే లభిస్తున్నాయి. పలు IITల్లో కనిష్ఠ వేతనం రూ.6లక్షల నుంచి రూ.7లక్షలలోపే ఉంటోంది. టాప్ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్యాకేజీపై ప్రభావం చూపుతున్నాయి. గతేడాది IIT బాంబేలో 22 మందికి రూ.కోటి ప్యాకేజీ లభించగా, అతి తక్కువ ప్యాకేజీ ₹4-6లక్షలుగా నమోదైంది. ఖరగ్‌పూర్, రూర్కీల్లో ₹8లక్షల వరకూ ఉంది.
పెయింటర్‌గా పనిచేస్తోన్న 30 ఏళ్ల అబావో ఒకే రోజు సెలవు తీసుకొని వరుసగా 104రోజులు పనిచేసి మరణించిన ఘటన తూర్పు చైనాలో జరిగింది. న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో అబావో చనిపోయారని కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈయన మరణానికి 20% యజమానే బాధ్యుడని పేర్కొంటూ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చైనాలో చాలా మంది కార్మికులది ఇదే పరిస్థితని తెలిపింది.
‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు దిగారు. విజయ చంద్రహాస్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు సినీ ప్రముఖులపై తప్పుడు వీడియోలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పాడని వెల్లడించారు.
విక్రమ్ హీరోగా నటించిన ‘అపరిచితుడు’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడంపై ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ స్పందించారు. ఈ సినిమా రీమేక్ గురించి దర్శకుడు శంకర్‌కే తెలుసని చెప్పారు. రణ్వీర్ ఈ చిత్రంలో అపరిచితుడు పాత్రలో అద్భుతంగా నటిస్తారని నమ్మకమున్నట్లు తెలిపారు. ఈ రీమేక్‌పై ప్రకటన వచ్చినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.
Sorry, no posts matched your criteria.