India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల వరకు తెలంగాణలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP: రాష్ట్రంలో అతి భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. YSR, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారని సమాచారం. మరోవైపు ఏఐసీసీ నేతలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశముంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన హస్తిన పర్యటనకు వెళ్లే ఛాన్సుంది. క్యాబినెట్ విస్తరణపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాము ఏపీకి వెళ్లబోమని IASలు వాణీప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ వేసిన పిటిషన్‌లపై <<14364444>>CAT<<>> తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘IASలు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు. సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? విజయవాడలో భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి సేవ చేయాలని లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. CAT తీర్పుపై IASలు HCలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
AP: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేటి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <
కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.