India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత టెస్టు జట్టు అంతా సూపర్ స్టార్లతో నిండి ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ కొనియాడారు. వారిని తామెప్పుడూ గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. ‘భారత జట్టు బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ ఆ జట్టు ఆటగాళ్లు రాణిస్తుంటారు. బుమ్రా, కోహ్లీ టీమ్ ఇండియాకు తురుపుముక్కలు. అయితే మేం వెనక్కి తగ్గం. అడిలైడ్ టెస్టులో కచ్చితంగా విజయం సాధించేందుకు ట్రై చేస్తాం’ అని పేర్కొన్నారు.

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆయన వివాహం చేస్తామని శ్రీనివాస్ తండ్రి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ తెలిపారు. ‘శ్రీనివాస్‌కు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తాం. అంతా ఫిక్స్ అయిపోయినట్లే. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని సురేశ్ వెల్లడించారు. కాగా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా ఈనెల 20న రిలీజ్ కానుంది.

అడిలైడ్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు 5వేలమందికి పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. భారత క్రికెటర్లను వారిలో పలువురు అసభ్యంగా దూషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోహిత్, పంత్ బరువుపై ట్రోల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారత ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానుల్ని అనుమతించేది లేదని బీసీసీఐ ప్రకటించింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌కు 50మంది మాత్రమే రావడం గమనార్హం.

మహానటి కీర్తి సురేశ్, తన ప్రియుడు అంథోనీని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి అని ఓ వెడ్డింగ్ కార్డ్ వైరలవుతోంది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం. ఇటీవల కీర్తి తన కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.

AP: ఈ నెల 11న రైతు సమస్యలపై వైసీపీ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తుందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై జనవరి 3న కలెక్టర్ల వద్ద నిరసన చేపడుతామని చెప్పారు.

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం 4 దశల్లో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మార్పుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. పౌర సేవల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు తగిన పాలసీ విధానాలను రూపొందించడంలో కేంద్రం నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది.

TG: రూ.2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేసే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరికైనా ఇప్పటికీ మాఫీ కాకపోతే తన ఆఫీసుకు రావాలన్నారు. రూ.2 లక్షలపైనే రుణాలు ఉన్న వారికి త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పారు. ఆపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు. మిగిలిన హామీలను వరుస క్రమంలో నెరవేరుస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతరం సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉంటారు. కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు’ అని తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.
Sorry, no posts matched your criteria.