News December 4, 2024

వచ్చే ఏడాది టాలీవుడ్ హీరో పెళ్లి!

image

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆయన వివాహం చేస్తామని శ్రీనివాస్ తండ్రి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ తెలిపారు. ‘శ్రీనివాస్‌కు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తాం. అంతా ఫిక్స్ అయిపోయినట్లే. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని సురేశ్ వెల్లడించారు. కాగా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా ఈనెల 20న రిలీజ్ కానుంది.

Similar News

News February 13, 2026

త్వరలో మెస్ ఛార్జీలు పెంపు: మంత్రి సవిత

image

AP: బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో త్వరలోనే మెస్ ఛార్జీలు పెంచనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నోడల్ శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014-19 మధ్య కాలంలోనూ అప్పటి TDP ప్రభుత్వం 66% మేర మెస్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.

News February 13, 2026

శివయ్య చేతిలో త్రిశూలం ఎందుకు?

image

శివుని చేతిలోని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ 3 శక్తులు ఆయన ఆధీనంలో ఉంటాయని, వాటిని సమన్వయం చేస్తూ ఆయన సృష్టిని నడిపిస్తారని అర్థం. అలాగే జ్ఞానం, ఇచ్చాశక్తి, క్రియాశక్తిని సూచిస్తుంది. భక్తుల హృదయాల్లోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. అంతటి శక్తి త్రిశూలానికి ఉంటుంది. ఇది మానవునిలోని అరిషడ్వర్గాలను జయించి, ముక్తిని పొందే మార్గాన్ని బోధిస్తుంది.

News February 13, 2026

కాసేపట్లో కౌంటింగ్.. మున్సి‘పల్స్’ పట్టేదెవరో?

image

TG: రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉ.8 గంటలకు మొదలు కానుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యం సాయంత్రంలోగా తేలనుంది. 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అధికారులు అంతా సిద్ధం చేయగా ప్రతి గదిలోనూ వెబ్ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేస్తారు.