India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై పంచాంగకర్తల మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 31న జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగకర్తలు, నవంబర్ 1 అసలు తేదీ అని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. రేలంగి పంచాంగాన్ని TTD అనుసరిస్తుండటంతో ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే వారు సరైన పద్ధతిలో గణించలేదని, సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలని ధృక్ పంచాంగకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
TG: ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీం 84వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 17న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ కలెక్టర్ వెంకటేశ్ ఉత్తర్వులిచ్చారు. వచ్చే నెల 9న(రెండో శనివారం) వర్కింగ్ డేగా నిర్ణయించారు.
ఏపీకి వెళ్లాలని DOPT ఉత్తర్వులపై క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించనున్నారు. <<14364444>>క్యాట్ తీర్పు<<>> నేపథ్యంలో రేపు లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఐఏఎస్‌లు వాకాటి అరుణ, అమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాలని DOPT ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
AP: ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతిలో 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో-24ను హైకోర్టు కొట్టివేసింది. అమ్మఒడి పథకం అందిస్తుండటంతో 2023-24 సంవత్సరంలో పిల్లలను చేర్చుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం విద్యాహక్కు చట్టానికి భిన్నంగా ఉందంటూ జీవోను కొట్టివేసింది.
TG: గురుకుల స్కూళ్లు సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. గురుకుల సొసైటీల కార్యదర్శులతో సమీక్షించిన ఆయన.. ప్రతిరోజూ ఒక స్కూలును తనిఖీ చేయాలని ఆదేశించారు. భవనాల అద్దె చెల్లింపునకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పారు. అద్దె భవనాల యజమానులతో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి పరిశీలన వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’లో నటించే అవకాశాన్ని హీరో నాని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీలో ఫహాద్ ఫాజిల్ నటించిన దొంగ పాత్రకు తొలుత నానినే మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాలో ఆ పాత్రకు బరువు లేదని భావించి, నాని నిరాకరించారని టాక్. వేట్టయన్‌లో రానా, అమితాబ్ తదితరుల పాత్రలకూ సరైన ప్రాముఖ్యత లభించలేదు. దీంతో నాని నిర్ణయం కరెక్టేనంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్‌పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.
రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.
తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు CATలో కోరారు. తాము తెలంగాణలోనే ఉంటామని IASలు ఆమ్రపాలి, కరుణ, వాణిప్రసాద్ CATలో వాదించారు. దీంతో ఏపీలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారని, అలాంటి చోటకు వెళ్లి సేవ చేయాలని లేదా అని IASలను క్యాట్ ప్రశ్నించింది. ప్రస్తుతం DOPT వాదనలను క్యాట్ వింటోంది.
AP: లాటరీలో 3,396 మద్యం షాపుల కేటాయింపు పూర్తవడంతో రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరగనున్నాయి. ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.