India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీలో ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు ఓ తండ్రి మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు. భార్య ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి బిల్లు కడితేనే పంపుతామని యాజమాన్యం తేల్చిచెప్పడంతో తన మూడేళ్ల కొడుకును అమ్మకానికి పెట్టాడు. ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు మహిళల కయాక్ సింగిల్ 200M – KL1 సెమీఫైనల్స్‌లో భారత్ తరఫున పూజా ఓజా పోటీ పడుతున్నారు. మధ్నాహ్నం 1.30 జరిగే సెమీస్ గెలిస్తే, 2.55 గంటలకు ఫైనల్లో పోటీపడాల్సి ఉంటుంది. ఈ పారాలింపిక్స్ భారత్‌కు ఒక మైలురాయి. గతం కంటే ఘనంగా ఈసారి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో భారత బృందం 29 పతకాలు గెలుచుకుంది.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దిగ్గజ ప్లేయర్ ధోని రికార్డును సమం చేశారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-Bతో జరుగుతున్న మ్యాచులో ఒకే ఇన్నింగ్సులో జురెల్ ఏడు క్యాచులు అందుకున్నారు. 2004-05లో ఈ దేశవాళీ టోర్నీలో ధోని 7 క్యాచులు అందుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరేసి క్యాచులతో ఉన్నారు.
TG: ఖమ్మం నగరంలో మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.
దేశంలో 3 లక్షలు అంతకంటే తక్కువ జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో రాయ్‌బరేలీ మొదటి స్థానంలో నిలవగా నల్గొండ 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 10 లక్షలపైన జనాభా నగరాల్లో సూరత్ మొదటి స్థానంలో, ఫిరోజాబాద్, అమరావతి(మహారాష్ట్ర) తరువాతి స్థానాల్లో నిలిచాయి. వాయుకాలుష్యంలో PM10 స్థాయి తగ్గుదలకు గుర్తింపుగా కేంద్రం స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేసింది.
UP లక్నోలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదుగురి మృతదేహాలను బయటకి తీశారు. సహాయక చర్యలు జరుగుతున్నప్పుడు శిథిలాల కింద మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. వర్షం కురుస్తుండగా గోడళ్లో పగుళ్లు వచ్చి భవనం కూలినట్లు బాధితులు తెలిపారు.
కుటుంబంలో విభేదాలు సృష్టించేవారిని సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మేంద్ర బాబాపై ఆయన కూతురు భాగ్యశ్రీ(NCP శరద్ వర్గం) పోటీ చేస్తారనే ప్రచారంపై అజిత్ స్పందించారు. కూతురు కన్నా తండ్రిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని, తండ్రిపైనే పోటీ సరికాదని హితవు పలికారు. కాగా శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకొని షిండేతో అజిత్ పవార్ పొత్తు కలిసిన సంగతి తెలిసిందే.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
మహాదేవ అనే ట్రాక్‌మ్యాన్ తెగువ ఘోర రైలు ప్రమాదాన్ని ఆపింది. అతను కేరళలోని కుమ్టా, హొన్నావర్‌ల మధ్య ఓ చోట పట్టాల వెల్డింగ్ సరిగా లేనట్లు గుర్తించారు. ఆ రూట్‌లో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. వెంటనే కుమ్టా స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా అప్పటికే రైలు ముందుకొచ్చేసింది. దీంతో పట్టాల వెంట 5 నిమిషాల్లో అర కిలోమీటర్ పరిగెత్తి రైలును ఆపారు. వందల మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు.
TG: హైడ్రా <<14048767>>నోటీసులపై<<>> సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.