News December 3, 2024

లాయర్ దొరక్క హిందూ సాధువుకు దొరకని ఊరట

image

బంగ్లాదేశ్ అరెస్టు చేసిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణ‌దాస్‌కు ఇప్పట్లో ఊరట దొరికేలా లేదు. అతడి బెయిల్ విచారణ వాయిదా పడింది. ఆయన తరఫున వాదించేందుకు లాయర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఆయన నియమించుకున్న లాయర్ రామెన్ రాయ్‌పై ఇస్లామిస్టులు నిన్న <<14775519>>మూకదాడి<<>> చేయడం తెలిసిందే. తీవ్రగాయాల పాలైన ఆయన ఇప్పుడు ICUలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మరే లాయరూ కేసు వాదించడానికి ముందుకురావడం లేదు.

News December 3, 2024

తెలంగాణ తల్లి పేదరికంలో కనబడాలా?: శంబీపూర్ రాజు

image

TG: సచివాలయంలో CM రేవంత్ ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. సవతి తల్లి విగ్రహం అని BRS MLC శంబీపూర్ రాజు అన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేలా విగ్రహ రూపురేఖలు మారుస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల తల్లి విగ్రహాలు నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా? అని ప్రశ్నించారు. తాము రూపొందించిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పారు.

News December 3, 2024

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంపై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్ట్‌గా నిలుస్తోన్న సీఎం రేవంత్‌కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2024

పుష్ప-2 రిలీజ్‌ను అడ్డుకోలేం: హైకోర్టు

image

పుష్ప-2 టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. చివరి నిమిషంలో రిలీజ్‌ను ఆపలేమని స్పష్టం చేసింది. దీంతో సినిమాకు లైన్ క్లియరైంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బెనిఫిట్ షోల పేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

News December 3, 2024

నెటిజన్ డేటాను పోస్టు చేసిన జనసేన అభిమాని.. వైసీపీ ఫైర్

image

AP: ఓ నెటిజన్ వ్యక్తిగత సమాచారాన్ని జనసేన అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. ‘రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోంది. సున్నితమైన సమాచారం జనసేన అభిమానుల చేతుల్లోకి వెళ్లింది. వేధింపుల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరుతున్నాం’ అని ట్వీట్ చేసింది.

News December 3, 2024

ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే: కూనంనేని

image

TG: ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే అని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ‘ములుగు ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. రేషన్ కార్డులు, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. బీఆర్‌ఎస్‌కు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కూనంనేని విమర్శించారు.

News December 3, 2024

FIRST TIME: $350B దాటిన మస్క్ సంపద

image

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద రాకెట్‌లా దూసుకెళ్తోంది. నవంబర్ 5 నుంచి టెస్లా షేర్ల విలువ 42 శాతం పెరగడంతో చరిత్రలోనే తొలిసారి ఆయన మొత్తం సంపద $350 బిలియన్లను దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన సంపద $124 బిలియన్లు పెరగడం విశేషం. మస్క్ తర్వాతి స్థానాల్లో జెఫ్ బెజోస్($231B), జుకర్‌బర్గ్($210B), ఎల్లిసన్($198B), బెర్నార్డ్ ఆర్నాల్ట్( $171B) ఉన్నారు.

News December 3, 2024

‘పుష్ప-3’ సినిమా టైటిల్ ఇదే!

image

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ‘పుష్ప’ మూవీ సీక్వెల్ ‘పుష్ప-2’ మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. అయితే, ‘పుష్ప-3’ కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ టైటిల్ ఎండ్ కార్డులో ‘పుష్ప-3.. ది ర్యాంపేజ్’ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. ఎడిటింగ్ రూమ్‌లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News December 3, 2024

BREAKING: ఆందోళనకరంగా మహారాష్ట్ర సీఎం ఆరోగ్యం

image

మహారాష్ట్ర కేర్‌టేకర్ సీఎం ఏక్‌నాథ్ శిండే ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. కొన్నిరోజులుగా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శిండేకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2024

RBIకి త్వరలో కొత్త గవర్నర్?

image

RBI గవర్నర్ శక్తికాంత దాస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. DEC 10న ఆయన పదవీకాలం ముగుస్తుంది. క్రితంసారి నెలన్నర ముందుగానే కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకపోవడంతో కొత్త గవర్నర్‌ను నియమిస్తారన్న ఊహాగానాలు పెరిగాయి. పైగా రెపోరేటును తగ్గించాలని ఆర్థిక, వాణిజ్య మంత్రులు బహిరంగంగానే దాస్‌ను డిమాండ్ చేస్తున్నారు. 2025 Q2లో GDP 5.4%కు తగ్గడంతో ఆయనపై విమర్శలు పెరిగాయి.