India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 176/6 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ (63) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 4, ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ తీశారు. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు ఇదే తొలి విజయం. సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేన నేతలు పిఠాపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక నేతలు ముస్లిం ఇమామ్‌లను సత్కరించారు. రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వేసవిలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు వాడితే త్వరగా వేడెక్కే అవకాశం ఉంది. ACలు లేని చోట్ల వీటిని చల్లగా ఉంచేందుకు పలు చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించాక వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. గోడకు అంటిపెట్టకుండా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. వేడెక్కిందని అనిపిస్తే కాసేపు వాడకం ఆపేసి చల్లగా అయ్యాక ఉపయోగించడం ఉత్తమం.

ప్రతి సినిమాలో వేరియేషన్ ఉండేలా చూసుకునేవాడినని సీనియర్ హీరో బాలకృష్ణ అన్నారు. ఆదిత్య 369 రీరిలీజ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. తన నాన్న నందమూరి తారకరామారావు స్ఫూర్తితో కొత్తదనం కోసం ప్రయత్నించేవాడినని చెప్పారు. అదే కోవలో ఆదిత్య 369 చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట తన ఒంటికి పడదని చెప్పారు. కాగా ‘ఆదిత్య 369’ ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది.

దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ మరణంలో మరో కోణం తెరపైకి వచ్చింది. ఆయన మరణించిన విల్లాలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఓ మెడిసిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దానిని తొలగించారని కథనంలో పేర్కొంది. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడంలో ఆస్ట్రేలియా అధికారుల పాత్ర ఉండవచ్చని ఆ విల్లాకు వెళ్లిన ఓ పోలీసు అధికారి తాజాగా తెలిపాడు. 2022లో థాయ్‌లాండ్‌లో వార్న్ హఠాన్మరణం చెందారు.

నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. టారిఫ్‌లు రెట్టింపు చేయడమే కాకుండా అవసరమైతే బాంబు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ విధిస్తున్న ఆంక్షలతో ఇరాన్ గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.