India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా, రేపు బడులు తెరుచుకుంటాయి. ఇక TGలో రేపు కూడా సెలవు ఉండగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.
UK EX-PM బోరిస్ జాన్సన్ రాసిన ‘అన్‌లీష్డ్’ పుస్తకంలో PM మోదీపై ప్రశంసలు కురిపించారు. దౌత్యపరంగా, వ్యక్తిగతంగా మోదీ నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. మోదీని మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా అభివర్ణించిన బోరిస్ మొదటిసారి ఆయన్ను కలిసినప్పుడు ఉత్సుకతతో కూడిన శక్తిని అనుభూతి చెందానన్నారు. భారత్‌తో ఘనమైన బంధాన్ని కలిగి ఉన్నామని, తన హయాంలోనే స్వేచ్ఛా వాణిజ్యానికి పునాది వేశామన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <
TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.
IPS పీవీ సునీల్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం <<13613964>>క్రమశిక్షణ చర్యలు<<>> తీసుకోవడాన్ని BRS నేత, మాజీ IPS ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘ఆయన ట్విటర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముంది? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అనడం సర్వీస్ రూల్స్ ఉల్లంఘించడం ఎట్లయితది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదివితే అప్పుడైనా అర్థమైతదేమో’ అంటూ సీఎం చంద్రబాబును ప్రవీణ్ ట్యాగ్ చేశారు.
MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య తమ పనే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు గ్యాంగ్ సభ్యుడొకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితులు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలను అంగీకరించినట్టు తెలిసింది. ఈ హత్యతో ముంబైలో తన ప్రాభవాన్ని చాటుకోవడమే గ్యాంగ్‌స్టర్ ఉద్దేశ్యమని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
AP: వరద సాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ‘వరద బాధితుల కోసం దాతలు రూ.కోట్లు ఇస్తున్నారు. బాబుగారేమో ‘‘పులిహోర’’ చేస్తున్నారు’ అని సెటైర్లు వేశారు. మరోవైపు దాతలు రూ.కోట్లు ఇస్తుంటే రూ.కోటి విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్ మాత్రం ఇంకా ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు అంబటికి కౌంటర్ ఇస్తున్నారు.
తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్‌లో AP సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, MLA బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆమె వేలికి ఉంగరం తొడిగారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అటు డిసెంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
చెన్నై శివారులో భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానాలపై NIA విచారణ ప్రారంభించింది. మెయిన్ లైన్‌లో ఉండాల్సిందిగా సిగ్నల్ ఇచ్చినా రైలు లూప్‌లైన్‌లోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో దర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
Sorry, no posts matched your criteria.