India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: DJ టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తండ్రి సాయికృష్ణతో కలిసి సీఎం రేవంత్‌కు రూ.15లక్షల చెక్కును అందించారు. తెలంగాణలో గతంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు CMRFకు విరాళంగా ఈ చెక్కును సిద్ధూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సిద్ధూను సీఎం అభినందించారు.

TG: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలకు వీటిని ఇస్తామని, సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్ధిదారులను యాప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల చట్టబద్ధత, రెండు విడతల రైతు బంధు ఇవ్వాలని పట్టుబడతామన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

సిరియా రెబల్స్ డమాస్కస్‌ను చుట్టుముట్టడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ కుటుంబంతో విమానంలో పరారయ్యారు. విమానం సిరియా తీర ప్రాంతం వైపు పయనించిందని తెలుస్తోంది. అయితే కొద్దిసేపటికే యూటర్న్ తీసుకొని వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణమైంది. తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైనట్టు వార్తలొస్తున్నాయి. ఫ్లైట్‌ను బలవంతంగా ల్యాండ్ చేశారని తెలుస్తోంది. అసద్ రష్యా, ఇరాన్‌ను ఆశ్రయం కోరవచ్చని సమాచారం.

హయత్ తెహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబెల్స్ సిరియా రాజధాని డమాస్కస్‌ను వశం చేసుకోవడంతో Ex PM మహ్మద్ ఘాజీ అల్-జలాలీ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రెబెల్స్ హెడ్ అబు అల్-జులానీ ప్రకటించారు. అధికార మార్పిడి వరకు జలాలీ PMగా కొనసాగుతారన్నారు. త్వరలో ప్రజలు ఎన్నుకొనే కొత్త నాయకత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు జలాలీ తెలిపారు.

అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 198 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత జట్టు తడబడింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో కెప్టెన్ అమన్(26) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్, తమీమ్ తలో 3, ఫహద్ 2, మరుఫ్, రిజాన్ చెరో వికెట్ తీశారు. దీంతో ఆసియాకప్ బంగ్లాదేశ్ వశమైంది.

ఇండియా కూటమికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని NCP(SP) చీఫ్ శరద్ పవార్ స్వాగతించారు. ‘ఆమెకు కూటమిని నడిపే సామర్థ్యం ఉంది. నేతృత్వం వహిస్తానని చెప్పే హక్కు కూడా ఉంది. దేశంలో సమర్థత కలిగిన నేతల్లో ఆమె ఒకరు. పార్లమెంటుకు ఆమె పంపిన ఎంపీలందరూ కష్టపడి పని చేసే వారే’ అని స్పష్టం చేశారు.

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.

సిరియాలో ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబా వంగా అనే జ్యోతిషురాలు చెప్పిన జోస్యం గురించి చర్చ నడుస్తోంది. ‘సిరియా ప్రభుత్వం పడిపోయినప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఓ యుద్ధం మొదలవుతుంది. అది 3వ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుంది. చివరికి పశ్చిమ దేశాలు నాశనమవుతాయి’ అని పేర్కొన్నారు. 1996లో బాబా వంగా చనిపోయారు. అయితే, ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు గతంలో నిజమయ్యాయి.
Sorry, no posts matched your criteria.