India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్-ఆప్ పొత్తు ప్రతిపాదనల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. తమకు 10 సీట్లు కావాలని ఆప్ కోరుతుండగా కాంగ్రెస్ విముఖంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆప్‌నకు 5-6 సీట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతోంది. పొత్తు కుదరకపోతే 50 సీట్లలో ఒంటరిగా పోటీచేయడానికి ఆప్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.
అగ్ని-4 ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఈరోజు విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను పూర్తి చేశారు. తాము అనుకున్న అన్ని లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అందుకుందని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. తాజా ప్రయోగంతో ‘అగ్ని’ పరిధి 4వేల కిలోమీటర్లకు చేరిందన్నారు. 20 మీటర్ల పొడవైన క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదని వారు వివరించారు.
TG: రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేశ్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. నవరాత్రుల సందర్భంగా HYD సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని సీఎం గుర్తు చేశారు.
TG: కరీంనగర్(D) రామడుగులో ఓ ఇంట్లోకి రెండు కోతులు చొరబడ్డాయి. వాటి సడన్ ఎంట్రీతో బెదిరిన యజమాని శంకర్ బయటకు పరుగులు తీశారు. లోపలికెళ్లిన కోతులు ఎంతకీ బయటికి రాకపోగా లోపల గడియ పెట్టుకున్నాయి. వాటి అరుపులు విన్న మరికొన్ని కోతులు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. స్థానికులు గడియ తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కట్టర్‌తో కిటికీని తొలగించారు. మరి ‘కోతి పనుల’పై మీ కామెంట్?
వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వద్ద NDRF నిధులు రూ.1,345కోట్లు ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ నిధులను వాడుకోలేకపోయిందని ఆయన విమర్శించారు.
దులీప్ ట్రోఫీలో ఇండియా-బి, ఇండియా-ఏకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ 181 పరుగులు చేసి తన జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ టోర్నీ చరిత్రలో డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్‌ను దాటేశారు. బాబా అపరాజిత్(212), యశ్ ధుల్(193) తొలి రెండు స్థానాల్లో ఉండగా సచిన్(159) మూడో స్థానంలో ఉండేవారు. ముషీర్ ఆయన్ను 4వ స్థానానికి నెట్టి థర్డ్ ప్లేస్‌కు చేరుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘గోట్’ మూవీ తొలి రోజు కలెక్షన్లు అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.126.32 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలకపాత్రలు పోషించారు.
గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. వైద్య, పారిశ్రామికపరమైన ఉపయోగాల కోసం గంజాయిని సాగు చేయాలని అసెంబ్లీ కమిటీ ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి గంజాయి సాగు చక్కటి రాబడి అవుతుందని కమిటీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే విజయవంతమైందని అందులో వివరించింది.
AP: వరద బాధితులకు వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ చీఫ్ జగన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కృత్రిమ మేధలో కోర్సు నేర్చుకునేందుకు నటుడు కమల్ హాసన్ అమెరికా వెళ్లినట్లు డెక్కన్ హెరాల్డ్ ఓ కథనంలో తెలిపింది. గత వారం చివరిలో ఆయన అమెరికా బయలుదేరారని, 45 రోజుల పాటు USలోనే ఉంటారని పేర్కొంది. ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ వినియోగంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని వివరించింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, భారతీయుడు-2 సీక్వెల్స్, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.