India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.
AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.
TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
నైతిక నాగరిక సమాజంలో ఒక వ్యక్తి (M/F) శారీరక, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భాగస్వామి వద్దకు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తారని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భర్తపై పెట్టిన వరకట్నం కేసులో భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మధ్య లైంగిక సంబంధ అంశాల్లో అసమ్మతి చుట్టూ కేంద్రీకృతమైనట్టు పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమపై దాడికి ఇజ్రాయెల్‌కు సహకరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పొరుగున ఉన్న అరబ్ దేశాలు, గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమపై దాడికి భూభాగం-గగనతలం వాడుకునేలా అనుమతిస్తే ప్రతీకారం తప్పదని ఆయా దేశాలకు రహస్య దౌత్య మాధ్యమాల ద్వారా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పొగాకు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు తాను వ్యతిరేకమని గంభీర్ గతంలో చెప్పారు. మరి ఇప్పుడు మాట తప్పి డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న వ్యక్తి ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్య, నితీశ్, హార్దిక్, పరాగ్, రింకూ, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, మయాంక్
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో భారత్ సెమీస్ చేరుతుంది.
మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు విజయ దశమి రోజున అప్‌డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్‌తో చరణ్ పిక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్‌ను వదలనున్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.