India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐదో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎల్లుండి ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, జమ్మూ, లద్దాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న ఆరో విడత, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి.
TG: నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ.రమేశ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలువురు యూనివర్సిటీ అధ్యాపకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి పంపిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. వీలైనంత వేగంగా నివేదిక అందించాలని ఆదేశించారు.
టీ 20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న భారత జట్టు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కొందరు ఆటగాళ్లు ఆ రోజు పయనం కానున్నట్లు సమాచారం. అలాగే ఫైనల్ అనంతరం ఈ నెల 27న మిగిలిన ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు టాక్. తొలుత రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, సిబ్బంది వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది.
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది.
TG: సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, రాకేశ్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ఈనెల 25న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, మాజీ డిప్యూటీ PM ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీమంత్రి మురళీ మనోహర్ జోషి తదితరులు ఓటు వేశారు. ఢిల్లీలో ఇప్పటివరకు 5,406 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేసినట్లు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఇప్పటివరకు ఐపీఎల్‌తో బిజీగా గడిపిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తన కూతురు సమైరాతో ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. సమైరాతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ పరవాలేదనిపించారు. 14 మ్యాచ్‌ల్లో 417 పరుగులు సాధించారు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
AP: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది. పల్నాడు- మల్లికా గర్గ్, అనంతపురం- గౌతమి శాలి, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పల్నాడు కలెక్టర్‌గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొత్త ప్రభుత్వం సడలించే అవకాశం ఉందన్నారు DPIIT సెక్రటరీ రాజేశ్ కుమార్. ఇటీవల అంతరిక్ష రంగానికి సంబంధించిన FDI నిబంధనల్లో కొన్ని సడలింపులు చేశామన్నారు. సడలించేందుకు అవకాశం ఉన్న మిగతా అంశాలపైనా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. కాగా అంతకుముందు, కేంద్రం ఐదేళ్లలో FDIలను $100 బిలియన్లకు పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
యువత ఆలయాలకు రావట్లేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంది. అలాంటి ఆలయాలకు యువత వచ్చేలా నిర్వాహకులు ఆకర్షించాలి. అవసరమైతే గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు పఠనాసక్తి ఉన్న వారు ఆలయాల బాట పడతారు. జ్ఞానం పెంచుకుని ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు’ అని ఓ అవార్డు స్వీకారోత్సవంలో ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.