News October 12, 2024
అప్పుడు నారాయణ మూర్తి ఆహ్వానంపై రతన్ టాటా ఏమన్నారంటే?
రతన్ టాటాతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను నారాయణ మూర్తి ఇటీవల గుర్తు చేసుకున్నారు. Infosysలో జంషెడ్‌జీ టాటా హాల్ ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తే ‘TCS మీ ప్రత్యర్థి. నన్నెందుకు ఆహ్వానిస్తున్నారు’ అని టాటా వ్యాఖ్యానించారట. దీనికి బదులిస్తూ ‘జంషెడ్‌జీ సంస్థల స్వరూపాన్నే మార్చిన వ్యక్తి. ఆయన్ను మాతో పోటీదారుగా పరిగణించం. ఇది ఆయన్ను గౌరవించుకొనే విషయం’ అని చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
FUN: ఎవరూ చెప్పని, ఎక్కడా రాయని కొన్ని రూల్స్!
* సోషల్ మీడియాలో సోదరితో ఫొటోను అప్‌లోడ్ చేస్తే ఆమె మీ సోదరి అని క్యాప్షన్‌లో రాయాలి.
* ఇంటిముందు చెప్పులు తలకిందులుగా ఉంటే మనం ఎంత బిజీగా ఉన్నా వాటిని సరిచేయాలి.
* నాన్న గదిలోకి రాగానే ఫోన్‌ను దాచిపెట్టి, ఫోన్ వాడనట్లు నటించాలి.
* మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నా నవ్వు ఆపుకోవాలి.
* మెట్రో, రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో రిక్షాలను చూడనట్లు నటించాలి.
News November 5, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 5, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:16 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు ✒ ఇష: రాత్రి 6.57 గంటలకు ✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.