India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
బంగ్లాదేశ్‌లోని ఓ ఆలయంలో PM మోదీ సమర్పించిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైన ఘటనను భారత్ ఖండించింది. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన అపవిత్ర చర్యగా పేర్కొంది. తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, సత్ఖిరాలోని జేషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ ఘటనలను ఆందోళనకర చర్యలుగా గుర్తించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు శోచనీయమని పేర్కొంది.
దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత 5 రోజుల్లో విక్రయాలు 25శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సగటున రూ.1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలింది. ఇక ఈనెల 1 నుంచి 8 వరకు మొత్తం రూ.852.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ గురించి అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ ధర్మ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ఎ.ఎమ్ రత్నం విజయదశమి సందర్భంగా వెల్లడించారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడారని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.
తమిళనాడు కవరైపెట్టైలో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. రైలు మెయిన్ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా, ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించినట్లు దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. మెయిన్ లైన్‌పై వెళ్లాల్సిన రైలు ఎక్కడో తప్పు జరిగిన కారణంగా గూడ్స్ ఉన్న లైన్‌లోకి వెళ్లిందన్నారు. త్వరలోనే ఏం జరిగిందనేది ప్రకటిస్తామన్నారు.
హరియాణాలో BJP ప్రభుత్వం Oct 17న కొలువుదీరనుంది. పంచకులలో జరిగే కార్యక్రమంలో నాయబ్ సింగ్ సైనీ మరోసారి CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు నూతన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొత్త సభ్యులకు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం దక్కనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గుజరాత్‌లోని జామ్‌నగర్ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్‌జీ దిగ్విజయ్ సిన్హ్‌జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా కూడా పనిచేశారు.
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకొంటే లీగ్ నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించాలన్న నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేనెప్పుడూ అలా తప్పుకోలేదు. కానీ నాకు తొలి ప్రాధాన్యం దేశానికి టెస్టులు, ఐసీసీ ట్రోఫీలు ఆడటమే. షెడ్యూల్ బట్టి IPL వంటి టోర్నీలు ఆడాలా వద్దా అని నిర్ణయించుకుంటుంటాను’ అని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.