India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.
TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.
దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.
AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. జాతీయ సగటు రూ.90,372గా ఉంది. అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92శాతానికి పెరిగింది. ఇందులో జాతీయ సగటు 52%. ఇక దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తొలి 2 రాష్ట్రాలు TG(92%), AP(86%) కావడం గమనార్హం. మరోవైపు ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే 3.8 నుంచి 4.1కి పెరిగింది.
సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. యూపీలోని కాన్పూర్‌లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ దశకంఠుడికి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామునే దీనిని తెరుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడిని పండితుడిగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని సాయంత్రం కల్లా మూసివేస్తారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా, క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. మరోవైపు ఒక్క మ్యాచులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ ఆరాటపడుతోంది. మరి పండగ రోజు యువ భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
షవర్ హెడ్స్, టూత్ బ్రష్‌లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్‌లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్‌లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్‌లు దోహదపడతాయి.
Sorry, no posts matched your criteria.