News December 7, 2024

అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?

image

రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.

News December 7, 2024

ఈనెల 15న WPL మినీ వేలం

image

బెంగళూరులో ఈనెల 15న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. మొత్తం 120 మంది ప్లేయర్లు ఆక్షన్‌లో పాల్గొంటున్నారని, అందులో 29 మంది విదేశీ ప్లేయర్లున్నారని తెలిపింది. స్వదేశీ క్రికెటర్ల కోసం 19 స్లాట్లు, ఓవర్సీస్ ప్లేయర్లకు 5 స్లాట్లు కేటాయించినట్లు పేర్కొంది. WPLలో మొత్తం 5 జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

News December 7, 2024

బ్రిక్స్ కరెన్సీపై ప్రతిపాదనలు లేవు: జైశంకర్

image

US డాల‌ర్‌తో పోటీ ప‌డేందుకు బ్రిక్స్ దేశాల‌ కొత్త క‌రెన్సీ తెచ్చే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోలేద‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. $ విలువ‌ తగ్గింపుపై భారత్‌కు ఆస‌క్తి లేద‌ని తేల్చిచెప్పారు. భార‌త్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగ‌స్వామి అని, బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు లేవ‌న్నారు. కాగా బ్రిక్స్ దేశాలు కొత్త క‌రెన్సీ తెస్తే 100% టారిఫ్‌లు విధిస్తామ‌ని ట్రంప్ గతంలో హెచ్చరించారు.

News December 7, 2024

GOOD NEWS: LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు

image

టెన్త్/ఇంటర్/డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు.
వెబ్‌సైట్: <>https://licindia.in/<<>>

News December 7, 2024

కాంబ్లీకి ‘1983 వరల్డ్‌కప్ టీమ్’ అండగా నిలుస్తుంది: గవాస్కర్

image

ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ‘1983 వరల్డ్ కప్’ జట్టు సభ్యులు అండగా నిలిచేందుకు సిద్ధమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. ‘మా కొడుకులు, మనవళ్ల వయసున్న అనేకమంది క్రికెటర్లలో ఇబ్బందులు పడేవారిని చూస్తే చాలా బాధ కలుగుతుంటుంది. అలాంటి వాళ్లను ఆదుకుంటాం. సాయం అనే మాట వాడను కానీ కాంబ్లీకి అండగా ఉంటాం. ఏం చేయాలో చూస్తాం’ అని స్పష్టం చేశారు.

News December 7, 2024

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

image

గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 9 నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TGPSC ఓ ప్రకటనలో తెలిపింది. 1,368 సెంటర్లలో ఈ నెల 15, 16వ తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9.30 గంటలు, మ.2.30 గంటలలోపే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ 5.57 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

News December 7, 2024

బిలియనీర్లకు రాయితీలు.. సామాన్యులకు పన్ను పోట్లు: రాహుల్ ఫైర్

image

బిలియనీర్లకు రాయితీలు ఇస్తున్న కేంద్రం, సామాన్యులకు ఆదాయ ప‌న్ను, ఇత‌ర‌త్రా ప‌న్నుల రేట్లు పెంచుతూ అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌పై భారం మోపేలా మోదీ ప్ర‌భుత్వం కొత్త జీఎస్టీ స్లాబ్‌ను తీసుకొస్తోంద‌ని పేర్కొన్నారు. గ‌ర్బ‌ర్ సింగ్ ట్యాక్స్ ద్వారా రోజూ ఉప‌యోగించే వ‌స్తువుల‌పై అధిక ప‌న్నులు విధించేందుకు సిద్ధ‌ప‌డుతోంద‌ని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తుతామన్నారు.

News December 7, 2024

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు

image

ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి’ అని సూచించారు.

News December 7, 2024

బీజేపీ ఆరోపణలను ఖండించిన అమెరికా

image

భారత ప్రధాని మోదీ, అదానీపై ఆరోప‌ణ‌ల విషయంలో తమ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థల హస్తం ఉందన్న BJP వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఈ ర‌క‌మైన ఆరోపణలు నిరుత్సాహ‌క‌ర‌మైన‌వ‌ని పేర్కొంది. కాగా మీడియా సంస్థ OCCRP, రాహుల్ గాంధీతో అమెరికా జ‌ట్టుక‌ట్టింద‌ని BJP ఇటీవల ఆరోపించింది. అందువల్లే OCCRP నివేదిక‌లను చూపుతూ అదానీ, మోదీపై రాహుల్ విమ‌ర్శ‌లు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడింది.

News December 7, 2024

ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

image

లెబ‌నాన్‌పై కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అమ‌లు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుప‌డుతోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్ప‌త్రిపై జ‌రిపిన వైమానిక దాడిలో 29 మంది మృతి చెందారు. వరుస దాడులతో ఆస్పత్రి ప‌రిస‌రాలు ర‌క్త‌పుమ‌డుగుల‌తో నిండిన‌ట్టు అల్‌-జ‌జీరా తెలిపింది. 2023 Oct నుంచి ఇజ్రాయెల్ జ‌రుపుతున్న దాడుల్లో ఇప్ప‌టిదాకా 44,612 మంది పాలస్తీనియన్లు మృతి చెంద‌గా, ల‌క్ష‌కు పైగా గాయ‌ప‌డ్డారు.