India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘డీజే టిల్లు’ సినిమాలో ఉన్నట్లుగా సిద్ధూ బయట ఉండరని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సిద్ధూకు ఎంత సేపూ సినిమా, క్యారెక్టర్‌కు న్యాయం చేయాలనే తపన ఉందని అన్నారు. ‘డీజే టిల్లు’ మూవీతో మన జీవితంలో మిగిలిపోయే క్యారెక్టర్ ఇచ్చారని కొనియాడారు. టిల్లు మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయ్యాడని అన్నారు. నవ్వలేను బాబోయ్ అనేంతగా టిల్లు పాత్రలో సిద్ధూ నవ్వించాడన్నారు.
వచ్చే టీ20 ప్రపంచ కప్‌నకు సంజూ శాంసన్, పంత్ ఇద్దరూ టీమ్ ఇండియాలో ఉండాలని వెస్టిండీస్ దిగ్గజం లారా అభిప్రాయపడ్డారు. కీపింగ్‌కు భారత జట్టులో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఒకరినే ఎంపిక చేయాలా అన్న ప్రశ్నపై స్పందించారు. ‘వాళ్లిద్దరిలో ఒకరిని కాదు. ఇద్దర్నీ భారత్ సెలక్టర్లు జట్టులోకి తీసుకోవాలి. ఈ సీజన్లో వారు అద్భుతంగా ఆడుతున్నారు. శాంసన్ టైమింగ్, పంత్ ఫామ్ రెండూ బాగున్నాయి’ అని లారా పేర్కొన్నారు.
TG: కొడంగల్‌లో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించి తనను కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇందుకోసం BJP, BRS కలిసి కుట్రలు చేస్తున్నాయి. నన్ను దెబ్బతీయడానికి గూడుపుటానీ చేస్తున్నారు. నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి’ అని శ్రేణులకు CM పిలుపునిచ్చారు.
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్‌కు సంబంధించి ఫోర్బ్స్ ఇండియా సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంస్థ నుంచి స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లు కొన్న 75లక్షల మందికిపైగా కస్టమర్ల పర్సనల్ డేటా లీకైనట్లు తెలిపింది. ShopifyGUY అనే హ్యాకర్ ఈ డేటాను డార్క్ వెబ్‌లో లీక్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు మొదలైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టైటిల్ చూసి షాకయ్యారా? మీరు చదివింది నిజమే. 2003లో JP దత్తా డైరెక్షన్లో వచ్చిన ‘LOC కార్గిల్’లో 33మంది హీరోలు, 10మంది హీరోయిన్లు నటించారు. 4.15గంటల నిడివున్న ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ₹33కోట్ల బడ్జెట్ పెడితే ₹31కోట్లు వచ్చాయి. ఇందులో సంజయ్ దత్, అజయ్ దేవ్గన్, సైఫ్, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్‌పాయ్, కరీనా, రవీనా టాండన్, నమ్రత వంటి తారలు నటించారు.
TG: చేనేత కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఉపాధి కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల నుంచి వస్త్రాల ఎగుమతులకు చర్యలు తీసుకుంటామన్నారు. నేతన్నలు బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు పట్టించుకోవద్దని కోరారు. చేనేతల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. కరెంట్ సబ్సిడీ, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇస్తామని తెలిపారు.
AP: TTD EO ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ TDP-JSP-BJP కూటమి నేతలు CEO ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. తిరుమల, తిరుపతిలో రాజకీయ ప్రచారం, అక్రమాలకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. ‘ధర్మారెడ్డి వల్ల టీటీడీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. TTDకి చెందిన రూ.5వేల కోట్ల నిధులను దారిమళ్లించారు. టీటీడీ ఛైర్మన్ తన అనుచరులకు రూ.1500 కోట్లు ఎలా విడుదల చేశారు?’ అని కూటమి నేతలు ప్రశ్నించారు.
భారత్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లలో పనిచేసే 78వేల మంది ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని యాపిల్ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్‌కు కొంతమేర నిధులు అందించనున్నాయి. తయారీదారులైన ఫాక్స్‌కాన్, టాటా, శాల్‌కాంప్ సంస్థల ఉద్యోగులకు ఈ ఇళ్లు నిర్మించనున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. కాగా చైనాలోనూ యాపిల్ ఇదే తరహాలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మించింది.
తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.. రేపు ADB, ASF, మంచిర్యాల, NRML, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, పెద్దపల్లి, KMRD జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. అటు GDL, MBNR, నాగర్‌కర్నూల్, WNP, NRPT, KMM, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ తేదీలో మార్పు చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో సాధారణ బెయిల్‌పై విచారణ త్వరగా చేయాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ఈనెల 20న జరగాల్సిన విచారణను 16కు కోర్టు వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.