India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇండియాలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. రూ.1,400 కోట్లతో కర్ణాటకలోని చామరాజనగర్‌లో ‘ముత్తయ్య బేవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్’ పేరుతో డ్రింక్స్, స్వీట్స్ తయారీ సంస్థను నెలకొల్పుతున్నారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 46 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. 2025 జనవరి నాటికి ఈ సంస్థను ప్రారంభించనున్నారు. అలాగే ధార్వాడ్‌లోనూ మరో యూనిట్ నెలకొల్పాలని యోచిస్తున్నారు.
కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే చిప్‌లను తయారు చేసే అమెరికా టెక్నాలజీ కంపెనీ ‘Nvidia’ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి తొలి స్థానానికి చేరింది. NVIDIA కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ 3.327 ట్రిలియన్ డాలర్లు కాగా, మైక్రోసాఫ్ట్ 3.321 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. యాపిల్ కంపెనీ మూడో స్థానంలో కొనసాగుతోంది.
TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
చాలా వరకు స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు లేనప్పటికీ తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం పట్ల ఆకర్షితులవుతున్నారని NCERT చీఫ్ సక్లానీ అన్నారు. ‘కంటెంట్ మొత్తాన్ని ఆంగ్లంలో నింపడం వల్ల పిల్లలు వారి మూలాలు, సంస్కృతికి దూరం అవుతారు. వారి విజ్ఞానంపైనా ప్రభావం పడుతుంది. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఇంగ్లిష్ మీడియంపై మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.
జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. 6న తొలి టీ20, 7న రెండో, 10న మూడో, 13న నాలుగో, 14న చివరి మ్యాచ్ జరగనుంది.
సింగర్ అల్కా యాగ్నిక్‌కు సోకిన <<13462020>>వ్యాధి<<>>కి గల కారణాలను డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ‘ఇది వైరల్ ఇన్ఫెక్షన్. వినికిడి లోపానికి అనేక వైరస్‌లు కారణం. ENT సర్జన్ క్లినికల్ పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. వైరల్ సంక్రమణకు గురికాకుండా జాగ్రత్త పడాలి. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండండి. ఇయర్ ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించొద్దు’ అని తెలిపారు.
అస్సాంలో హృదయవిదారక ఘటన జరిగింది. క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ భార్య మృతి చెందడంతో తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే భర్త, IPS ఆఫీసర్ శిలాదిత్య చెటియా ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకున్న ఆయనను ఆస్పత్రికి తరలించేలోపు మరణించారు. శిలాదిత్య అస్సాం ప్రభుత్వంలో హోం&పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పనిచేసేవారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన పలు జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు.
ప్రధాని మోదీ యూపీలోని వారణాసిలో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీలో గంగా హారతిని వీక్షించడం అద్భుతమైన అనుభవం అని ట్వీట్ చేశారు. అక్కడి పవిత్రమైన గంగానది, దీపాల వెలుగులు, భక్తి పారవశ్యం ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. అంతకుముందు వారణాసిలో పీఎం కిసాన్ 17వ విడత నిధులను మోదీ విడుదల చేశారు.
ఎవరైనా హద్దులు దాటి తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని పాకిస్థాన్ క్రికెటర్ <<13462747>>హారిస్<<>> రవూఫ్ హెచ్చరించారు. అమెరికాలోని ఓ హోటల్‌లో జరిగిన గొడవపై రవూఫ్ స్పందించారు. ‘ఈ గొడవను సోషల్ మీడియా వరకు తీసుకురావద్దని అనుకున్నా. కానీ తప్పక స్పందిస్తున్నాను. ఫ్యాన్స్ కొన్నిసార్లు విమర్శిస్తారు, మరి కొన్ని సార్లు ప్రశంసిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాలి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
AP: ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. అక్కడ మురుగుకాలువల బాగు కోసం కలెక్టర్ సహకారంతో “Drainage Maintenance Infrastructure Fund, UNDI” పేరుతో ప్రత్యేక ఖాతాను తెరిపించానని చెప్పారు. ఈ నిధికి తొలి విరాళంగా రూ.5 లక్షలు ఇచ్చానని, ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని RRR కోరారు.
Sorry, no posts matched your criteria.