India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల <<13460226>>ఫలితాలు<<>> మ.2 గంటలకు విడుదల కానున్నాయి. bie.ap.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.
సరిగ్గా 41 ఏళ్ల క్రితం.. జూన్ 18, 1983. జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్. భారత్ 9 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చారు కపిల్ దేవ్. 138 బంతుల్లో 175 రన్స్(నాటౌట్)తో టీం ఇండియా స్కోరును 266 పరుగులకు చేర్చారు. ఛేజింగ్‌లో జింబాబ్వే 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం తర్వాత తమ తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది భారత జట్టు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. ప్రస్తుతం 320 పాయింట్లు పెరిగి 77,316 వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ ఓ దశలో 77,347 చేరి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. నిఫ్టీ సైతం 23,573 చేరి సరికొత్త గరిష్ఠాలను తాకింది. మెటల్, PSU బ్యాంకులు, ఐటీ రంగాల షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
AP: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న <<13460880>>జగన్<<>> విజ్ఞప్తిపై మాజీ మంత్రి, TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ‘జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. AP ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప. ఓడితే EVMల తప్పా? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు EVMల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని సూచించారు.
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నికొలస్ పూరన్ రికార్డ్ సృష్టించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 2వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అఫ్గాన్‌పై ఆయన 53 బంతుల్లోనే 98 పరుగులు చేశారు. మొత్తంగా విండీస్ 218 రన్స్ చేయగా.. ఛేదనలో అఫ్గాన్ ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
TG: రాష్ట్రంలోని 10వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఈ ఆదేశాలతో భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు కానున్నారు. వీరితో పాటు SGTలూ పదోన్నతి పొందే అవకాశం ఉంది.
భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డారు. త్రోడౌన్స్కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా ఓ బంతి ఆయన మణికట్టును బలంగా తాకింది. ఫిజియో స్ప్రే చేసిన అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఆయన ప్రాక్టీస్ కొనసాగించారు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. ఎల్లుండి అఫ్గానిస్థాన్‌పై భారత్ తొలి సూపర్-8 మ్యాచ్‌ను బార్బడోస్‌లో ఆడనుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు, రేపు ఉత్తర కొరియాలో పర్యటించనుండటంపై యూఎస్ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పుతిన్ పర్యటన గురించి మాకు బెంగ లేదు కానీ రెండు దేశాల బంధం బలోపేతం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా ఇస్తున్న క్షిపణుల్నే రష్యా ఉక్రెయిన్‌పై వాడుతోంది. ఇప్పుడు కొరియా ద్వీపకల్ప పరిస్థితుల్నీ పుతిన్ పర్యటన ప్రభావితం చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
Sorry, no posts matched your criteria.