News January 18, 2025
నిరాశపరిచిన సింధు

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్‌లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
Similar News
News February 15, 2025
బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదు: మహేశ్ గౌడ్

TG: బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే తొలగించారని చెప్పారు. బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై నానా హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకేమీ చేయలేదని విమర్శించారు.
News February 15, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన విద్యార్థులు

AP: మంత్రి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో వెటర్నరీ విద్యార్థులు కలిశారు. తమ స్టైఫండ్ పెంచాలని మంత్రిని వారు కోరారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
News February 15, 2025
42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్

TG: తాము చేసిన కులగణనలో ఒక్క తప్పున్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘మా సర్వేను మొత్తం 5 కేటగిరీలుగా విభజించాం. హిందూ, ముస్లిం బీసీలు కలిపి 56 శాతం అయ్యారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం’ అని చెప్పారు. కాగా అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.