News June 17, 2024

చెల్లెళ్లతో ప్రభాస్

image

‘కల్కి’ సినిమాలోని భైరవ ఆంథమ్ సాంగ్ షూటింగ్ సమయంలో డార్లింగ్ ప్రభాస్ తన కజిన్స్ ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలతో కలిసి సందడి చేశారు. వారితో కలిసి బల్లె బల్లె స్టెప్పులేశారు. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కు వారిని పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో సాంగ్ ఈరోజు రిలీజవడంతో షూటింగ్ పిక్స్ బయటకొచ్చాయి.

News June 17, 2024

ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్

image

ఉత్తరకొరియా అధినేత కిమ్ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 18-19 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఒకవైపు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, మరోవైపు దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశానికి పుతిన్ వెళ్లడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.

News June 17, 2024

గుండెలను పిండేసే ఘటన

image

గత ఏడాది కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరులో కల్నల్ మన్‌ప్రీత్ వీరమరణం పొందారు. ఆ విషయం తెలియని కొడుకు కబీర్‌(7) ఇప్పటికీ తండ్రి నంబర్‌కు ‘పాపా.. ఓసారి తిరిగి రండి. తర్వాత డ్యూటీ చేసుకోవచ్చు’ అని మెసేజ్‌లు పంపుతున్నట్లు తల్లి జగ్‌మీత్ వెల్లడించారు. ‘ఆయన సొంతూరు(మొహాలీ)లో పిల్లలు కబీర్, వాణి పేరిట మొక్కలు నాటారు. 10ఏళ్ల తర్వాత వాటిని చూడటానికి వస్తామన్నారు. కానీ ఇలా జరిగింది’ అని ఆవేదన చెందారు.

News June 17, 2024

ప్రతీ టెస్లా కారు హ్యాక్ అవ్వొచ్చు: రాజీవ్ చంద్రశేఖర్

image

ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. EVM ఓట్లను లెక్కించి, భద్రపరిచే యంత్రం మాత్రమే అని, హ్యాక్ చేసేంత ఆధునాతన మెషీన్లు కావన్నారు. ఈవీఎంల గురించి మస్క్ తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పూర్తి సెక్యూర్ కాదని, టెస్లా కార్లు సైతం హ్యాకింగ్‌కు గురవుతాయని చెప్పొచ్చని అన్నారు.

News June 17, 2024

ఆ 136 మంది MPలు ప్రమాణస్వీకారం చేస్తారా?

image

కాంగ్రెస్‌&SPకి చెందిన 136 మంది MPల ప్రమాణస్వీకారం ప్రశ్నార్థకంగా మారింది. ప్రచారంలో గ్యారంటీల పేరుతో వారు ఓటర్ల నుంచి వివరాలు సేకరించారని, అది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం లంచం కిందకి వస్తుందని ఇప్పటికే రాష్ట్రపతి వద్ద అభ్యర్థన దాఖలైంది. వారిపై అనర్హత వేటు వేయాలనే ఆ అభ్యర్థనపై ఆమె న్యాయ అభిప్రాయం కోరారు. పార్లమెంట్ సమావేశాలు ముంగిట వేళ రాష్ట్రపతి తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

News June 17, 2024

ఇన్‌స్టా, టెలిగ్రామ్ ఛానల్స్‌తో జాగ్రత్త: NSE

image

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై టిప్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో వచ్చే ఛానల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని NSE హెచ్చరించింది. “ఇన్‌స్టాలో ‘bse_nse_latest’, టెలిగ్రామ్‌లోని ‘భారత్ ట్రేడింగ్ యాత్ర’, ‘VR టెక్నికల్స్’ హ్యాండిళ్లకు దూరంగా ఉండండి. ‘డా.స్టాక్ మార్కెట్ కంపెనీ’ అనే గ్రూప్‌ను ఫాలో కావొద్దు. పెట్టుబడుల పేరుతో వీరు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు సేకరిస్తున్నారు” అని పేర్కొంది.

News June 17, 2024

జట్టు వైఫల్యానికి నాదే బాధ్యత: హసరంగ

image

T20WCలో జట్టు వైఫల్యానికి కారణాలు ఏమైనా తనదే పూర్తి బాధ్యత అని శ్రీలంక కెప్టెన్ హసరంగ తెలిపారు. పిచ్‌లపై నింద మోపబోనని స్పష్టం చేశారు. ఇతర జట్లూ ఇదే పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాయని గుర్తు చేశారు. గ్రౌండ్ పరిస్థితులకు తాము అడ్జస్ట్ కాలేకపోయామని చెప్పారు. గ్రూప్-Dలో సౌతాఫ్రికా, బంగ్లా చేతుల్లో లంక ఓడిపోగా, నేపాల్‌తో మ్యాచ్ రద్దయ్యింది. నెదర్లాండ్స్‌పై మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News June 17, 2024

గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి.. UPSCకి 50మంది దూరం!

image

మహారాష్ట్రలోని సమర్థ్‌నగర్‌లో ఉన్న స్వామి వివేకానంద కాలేజీలో UPSC ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ వడగావ్ కోహ్లటీలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. మ్యాప్స్‌పై ఆధారపడ్డ 50మందికి పైగా అభ్యర్థులు మొదట వడగావ్ కోహ్లటీకి వెళ్లారు. తప్పుడు సెంటర్‌‌కి వచ్చామని గ్రహించి సమర్థ్‌నగర్‌కి చేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేశారు. దీంతో వారంతా పరీక్షకు దూరమయ్యారు.

News June 17, 2024

ఏఐతో సాఫ్ట్‌వేర్ రంగం నష్టపోదు: బిల్‌‌గేట్స్

image

ఏఐతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నష్టపోతారనే వాదనను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తోసిపుచ్చారు. ఏఐ ఉన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలన్నిటినీ ఏఐ భర్తీ చేసే అవకాశం ఉన్నా 20ఏళ్లలో అది సాధ్యం కాదన్నారు. ఏఐతో ఉత్పాదకత మెరుగైందని.. భారత్, USలోని అనేక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమని తెలిపారు. జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 17, 2024

EVMలు లేకపోతే బీజేపీకి 40 సీట్లూ వచ్చేవి కాదు: ఆదిత్య థాక్రే

image

EC అంటే ఎన్నికల కమిషన్‌ కాదని, ఈజ్లీ కాంప్రమైజ్డ్‌ అని శివసేన(UBT) నేత ఆదిత్య థాక్రే విమర్శించారు. EVMలు లేకపోతే BJPకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానం ఫలితంపై సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ప్రకటించారు. 48 ఓట్లతో గెలిచిన రవీంద్ర MPగా ప్రమాణం చేయకుండా ఆపాలని కోరుతామన్నారు. కౌంటింగ్ సమయంలో MP బంధువు మొబైల్‌తో ఓపెన్ చేసి డేటా మార్చినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.