India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
AP: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
TG: మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీని మంత్రి సీతక్క ఆరా తీశారు. ఖమ్మం మున్నేరుకు వరద ప్రవాహం 14 అడుగులకు చేరింది. ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
థర్డ్ అంపైర్ లేకుండానే ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ T20 సిరీస్ ముగిసింది. థర్డ్ అంపైర్ లేకపోవడంతో DRS, రనౌట్, స్టంపౌట్‌ను ఫీల్డ్ అంపైర్లే ప్రకటించారు. ఈ విషయంలో ఆసీస్ బ్యాటర్ మెక్‌గుర్క్‌కు కలిసొచ్చింది. రెండో T20లో అతడు స్టంపౌటైనా ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. రీప్లేలో ఔటైనట్లు స్పష్టంగా కనిపించింది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఆసీస్ ఆడుతున్నా థర్డ్ అంపైర్ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉ. 8.30 గంటల నుంచి రాత్రి వరకు అత్యధికంగా మహబూబాబాద్‌లో 18.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తల్లాడలో 12.2, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 11.1, అమనగల్‌లో 9.8, భద్రాద్రి జిల్లా చంద్రుగొండలో 9.3 సెం.మీ వర్షం కురిసింది. దీంతో మున్నేరు నదితో పాటు పలు వాగులకు వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. ఈ ఏడాది ఆయన రూ.135 కోట్ల వేతనం అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగింది. రూ.135 కోట్ల ప్యాకేజీలో కమీషన్లు రూ.122 కోట్లు ఉండగా, రూ.13 కోట్లు జీతంగా తీసుకున్నారు. ఆయన తర్వాత సౌరభ్ అగర్వాల్-రూ.30 కోట్లు, కృతి వాసన్-రూ.25 కోట్లు, పునీత్ చత్వాల్-రూ.19 కోట్లు, టీవీ నరేంద్రన్-రూ.17 కోట్లు ఉన్నారు.
‘ఇండియన్ 2’ మూవీ ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉందని నటి రేణూ దేశాయ్ అన్నారు. ఇదే కాదు ఇలాంటి సినిమాలన్నీ డిజాస్టర్లు కావాలని ఆమె కోరుకున్నారు. ‘‘ఇండియన్ 2’ లో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంది. అసలు ఇలాంటి డైలాగులు ఎలా రాస్తారా? వాళ్లకేమైనా బుర్ర పాడైందా? వీధికుక్కలు డర్టీగా ఉండవు. వాటికి ప్రేమ కావాలి. ద్వేషం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లాంటి వారు వస్తేనే పాకిస్థాన్ క్రికెట్ బాగుపడుతుందని ఆ దేశ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అన్నారు. అలాంటి వారే తమ క్రికెట్ పతనాన్ని అడ్డుకోగలరని చెప్పారు. ‘గంభీర్ ముక్కుసూటి మనిషి. ఆయనకు వెన్నుపోటు పొడవడం తెలియదు. కోచ్ అంటే అలానే ఉండాలి. తమ క్రికెట్ బోర్డు ఎన్ని మార్పులు చేసినా లాభం లేకుండా పోతోంది. ఆటగాళ్లు లెక్కలేనితనంతో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పుట్టినరోజు నేడు. 1999లో ఇదే రోజు పంజాబ్‌లోని ఫజిల్కాలో జన్మించారు. మూడేళ్ల నుంచే ఆయన క్రికెట్ ఆడుతున్నారు. 19 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుని స్టార్ క్రికెటర్‌గా ఎదిగారు. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదారు. IPLలో ఆరెంజ్ క్యాప్ సాధించారు. ప్రస్తుతం ఆయన GT కెప్టెన్‌గా ఉన్నారు.
TG: సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.