India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆకలి కోరల్లో చిక్కుకుపోయిన జింబాబ్వేకు మానవతా సాయంతో భారత్ సాయం చేసింది. ఆ దేశంతోపాటు జాంబియా, మాలావికి కూడా ఆహారం పంపింది. 1,000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు పంపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. కాగా వర్షాల లేమితో తీవ్ర కరువు ఏర్పడి ఈ మూడు దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది.
BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వారే వాటిని తుంగలో తొక్కుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీలో మంగేష్ యాదవ్ అనే యువకుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి నమ్మకం లేదన్న విషయాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమర్శించారు.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.
1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
1933: బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే జననం
1936: మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి జననం
1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ జననం
1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
1999: టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
2020: టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:24 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
AP: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే మాజీ CM జగన్ హైదరాబాద్‌లో విందులు, వినోదాల్లో మునిగితేలారని టీడీపీ ఆరోపించింది. ప్రజలను నువ్వు ఆదుకోవు, ఇతరులను ఆదుకోనివ్వవు అని ట్విటర్‌లో విమర్శించింది. ‘నీ అడ్రస్ గల్లంతు చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు. ఎప్పటికైనా లండన్‌లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి ఆలోచించే గుణం నీకెక్కడిది? నీదంతా కుళ్లు, కుతంత్రాలు, శవ రాజకీయాలు’ అని మండిపడింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
శు.పంచమి: రా.7.58 గంటలకు
స్వాతి: మ.3.30 గంటలకు
వర్జ్యం: రా.9.42-రా.11.28 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.5.24 గంటల వరకు
AP: విజయవాడలో వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది వెళ్లలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాంటప్పుడు వాలంటీర్లు ఎలా వెళ్తారని వైసీపీని టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వంపై బురద జల్లడం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బతకాలని ట్వీట్ చేసింది. ‘వేల మంది ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొంటే జగన్‌కు కనిపించదు. ఒక మాజీ సీఎంలా ప్రవర్తించు. హుందాగా ఉంటుంది’ అని మండిపడింది.
Sorry, no posts matched your criteria.