India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్నటి వైజాగ్ మ్యాచులో CSK ఓటమిపై ధోనీ భార్య సాక్షి సింగ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. విజయాల ఖాతా తెరిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను ప్రశంసించారు. మరోవైపు పరోక్షంగా ధోనీ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే.. CSK మ్యాచ్ ఓడిపోయిందని గుర్తించలేదని టీజ్ చేశారు. నిన్నటి మ్యాచులో ధోనీ ఆఖర్లో వచ్చి 37 పరుగులు చేశారు.
సుమారు 5000మంది భారతీయులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయారు. నేరస్థులు బలవంతంగా వారితో ఇండియాలోని పౌరులను ఆన్‌లైన్ ద్వారా మోసం చేయిస్తున్నారు. గత 6నెలల్లో రూ.500కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.67లక్షలు నష్టపోవడంతో స్కామ్ వెలుగు చూసింది. స్పందించిన కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దాదాపు 250 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది.
నిన్న ఢిల్లీతో మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఐపీఎల్ ఒకే ఓవర్లో 20 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచారు. ధోనీ 9 సార్లు ఈ ఫీట్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ధోనీ రికార్డులకెక్కారు.
AP: నిమ్మగడ్డ రమేశ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు వాలంటీర్లపై కుట్ర చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. ఇన్ని నెలలు పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘వికలాంగులు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు’ అని మండిపడ్డారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇది కష్టమే కానీ అసాధ్యం కాదన్నారు. మరోవైపు హైబ్రీడ్ వాహనాలపై ఉన్న GSTని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ ఇంధన దిగుమతులకు రూ.16లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధిస్తే ఆ డబ్బును రైతులు, గ్రామాలు, ఉపాధి మొదలైన అంశాలకు ఉపయోగించొచ్చు’ అని పేర్కొన్నారు.
TG: కాంగ్రెస్‌లో చేరిన MLA కడియం శ్రీహరి, కావ్య ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేస్తామని BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కడియం హస్తం గూటికి చేరే కుట్రకు అసెంబ్లీ సమావేశాల్లోనే బీజం పడిందన్నారు. అందుకే ముందుగా BRSలోని నాయకులను వేధించి, వెళ్లగొట్టి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారని మండిపడ్డారు. NTR, CBN, KCRకు వెన్నుపోటు పొడిచిన పెద్ద మోసగాడు కడియం అని ఫైరయ్యారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరఫున న్యాయవాది నితీశ్ రానా, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ 15 రోజులు తీహార్ జైలులో జుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. అయితే తనతోపాటు కొన్ని వస్తువులు జైలుకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అందులో మూడు పుస్తకాలు(భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్), స్పెషల్ డైట్, మెడిసిన్స్, ఓ కుర్చీ, టేబుల్‌తో పాటు ఓ లాకెట్‌ను తనతో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఐపీఎల్ సీజన్-18 మెగా వేలానికి బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కసరత్తు ప్రారంభించాయి. అందుకు సన్నాహక సమావేశాన్ని ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల ఓనర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వేలం విధివిధానాలు, ప్లేయర్ల రిటెన్షన్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రతి మూడేళ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాటను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తమ వినియోగదారులకు HDFC బ్యాంకు కీలక సూచనలు చేసింది. ఈ రోజు NEFT లావాదేవీలు చేయొద్దని స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా జరిగే కొన్ని కార్యకలాపాల దృష్ట్యా ఈరోజు చేపట్టే NEFT ట్రాన్సాక్షన్స్ ఆలస్యం కావడం లేదా అందుబాటులో ఉండకపోవడం జరగొచ్చని వివరించింది. దాని బదులు IMPS, RTGS, UPI విధానాలను వాడుకోవాలని కోరింది.
Sorry, no posts matched your criteria.