News April 1, 2024

పింఛన్ల పంపిణీ.. వైసీపీ-టీడీపీ ట్విటర్ వార్

image

AP: పింఛన్ల పంపిణీపై వైసీపీ, టీడీపీ మధ్య ట్విటర్ వార్ జరుగుతోంది. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు సెలవులు కావటంతో ఈ నెల పింఛన్లు 3న ఇస్తామని గత నెల 28న సాక్షిలో వార్త రాశారు. ఇప్పుడేమో రాజకీయాల కోసం అవ్వాతాతలను మోసం చేస్తున్నారు’ అని టీడీపీ ట్వీట్ చేసింది. దీనికి ‘చంద్రబాబు, నిమ్మగడ్డ పన్నిన కుట్రకు అవ్వాతాతలు బలయ్యారు. ఎన్నికల్లో టీడీపీని అవ్వాతాతలు తరమడం ఖాయం’ అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

News April 1, 2024

‘అరుణాచల్’ ప్రాంతాలకు చైనా సొంత పేర్లు!

image

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అక్కడి 30 ప్రాంతాలకు తమ భాషలో కొత్త పేర్లను పెట్టింది. ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం.. ఈ 30 ప్రాంతాల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ పేర్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ తమదేనంటూ చైనా చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

News April 1, 2024

BREAKING: YS షర్మిల పోటీ చేసేది ఇక్కడే

image

APలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా.. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది.

News April 1, 2024

ఎండలు భగభగ.. వడగాల్పుల సెగ

image

ఏపీలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయి. కడప, నంద్యాల, కర్నూలు, ATP జిల్లాల్లో 40-43 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 40-44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, SKLM, కాకినాడ, తూ.గో జిల్లాల్లోనూ 40- 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News April 1, 2024

టెట్ ఫీజులు తగ్గించండి: హరీశ్ రావు

image

TG: టెట్ ఫీజులను తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘టెట్ ఫీజులను భారీగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇవ్వలేదు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదు. మా ప్రభుత్వంలో టెట్ రెండు పేపర్లు రాసినా ఫీజు రూ.400 మాత్రమే ఉండేది’ అని గుర్తుచేశారు.

News April 1, 2024

జైలు నుంచి పాలించనున్న తొలి సీఎం!

image

లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న CM కేజ్రీవాల్‌‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతానికి 15రోజులు తిహార్ జైలు‌లో ఉండనున్నారు. జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఇలా జైలు నుంచి పాలించిన తొలి సీఎంగా నిలువనున్నారు. అయితే.. జైలు నుంచి ప్రభుత్వ పరమైన ఆర్డర్లు పాస్ చేయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.

News April 1, 2024

తిహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్‌‌

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌‌కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు.

News April 1, 2024

మయాంక్ అగర్వాల్‌పై SRH ఫ్యాన్స్ ఆగ్రహం

image

గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో SRH ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పవర్ ప్లేలో 17 బంతుల్లో 16 రన్స్ చేయడమే ఈ ఓటమికి ప్రధాన కారణమంటూ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముంబైతో హై స్కోరింగ్ మ్యాచ్‌లోనూ 13 బంతుల్లో 11 రన్స్ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. మయాంక్‌ను తప్పించి వేరొకరికి అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 1, 2024

‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

image

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదివరకే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుండగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ దీనికి వేదిక కానున్నట్లు సమాచారం.

News April 1, 2024

నియంత పాలనకు ఇదే నిదర్శనం: సీతక్క

image

TG: దేశంలో నియంత పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. నిన్న అద్వానీకి భారత రత్న ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఆయన పక్కనే కూర్చొని ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిల్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆదివాసీ మహిళను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.