India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇవాళ ఈ పిటిషన్ విచారించనున్న న్యాయస్థానం.. ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎల్-2024లో హోమ్ గ్రౌండ్ జట్లు విజయదుందుభి మోగిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తవగా.. ఆర్సీబీ మినహా అన్ని జట్లూ హోమ్ గ్రౌండ్‌లో విజయం సాధించాయి. మార్చి 29న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై ఆర్సీబీ ఓటమిపాలైంది. CSK చెన్నైలో రెండు విజయాలు నమోదు చేయగా నిన్న తొలి ఓటమిని చవిచూసింది. ఇక తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీకి నిన్న హోమ్ గ్రౌండ్‌లో తొలి విజయం దక్కింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ఇతర నగరాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో 2030నాటికి 40% ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2050కల్లా ఢిల్లీ, ముంబై, లక్నో, HYD, విశాఖపట్నంతో సహా డజనుకుపైగా నగరాల్లోని ప్రజలు దాహంతో అల్లాడక తప్పదని వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని UN సైతం పేర్కొంది.
ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపింది. అలా 285ఎకరాల ద్వీపాన్ని సముద్ర ఒప్పందం కింద అప్పగించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 తగ్గించడంతో ఢిల్లీలో దీని ధర రూ.1764.50గా ఉంది. అలాగే 5కేజీల FTL సిలిండర్ ధర కూడా రూ.7.50 తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
సిల్క్ సిటీ ఆఫ్ AP.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్, TDP 5 సార్లు, YCP ఒకసారి గెలుపొందాయి. ఈసారి పొత్తులో భాగంగా ఈ సెగ్మెంట్‌లో BJP పోటీ చేస్తోంది. YCP నుంచి మరోసారి బరిలో నిలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ధర్మవరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ఉవ్విళ్లూరుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
యూపీలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈరోజు సుప్రీం కోర్టు విచారించనుంది. మసీదులో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతిస్తూ దిగువకోర్టు ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి 26న అలహాబాద్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. కాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపీ మసీదు కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే అన్నదాతలు ఎన్నికల్లో నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేయడం చాలాసార్లు చూశాం. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రాజధానిలో ఆందోళన చేస్తున్న కిసాన్ మోర్చా రైతులూ ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తారని చాలామంది భావించారు. కానీ, వారు అందుకు సుముఖంగా లేరు. తాము BJP విధానాలను వ్యతిరేకిస్తున్నామని, అంతమాత్రాన పోటీ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
#ELECTIONS
Sorry, no posts matched your criteria.