News September 7, 2024

రూ.9 కోట్ల రాయి.. వాకిలి మెట్టుగా వాడిన బామ్మ

image

చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.

News September 7, 2024

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 181.. సెకండ్ ఇన్నింగ్స్‌లో డకౌట్

image

యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిరాశపర్చారు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-A, ఇండియా-B జట్లు తలపడుతున్నాయి. ఇందులో ఇండియా-B బ్యాటర్ ముషీర్ ఖాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 రన్స్ చేసి సంచలనంగా మారారు. దీంతో ఆ జట్టు 321 రన్స్ చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ప్రస్తుతం 33/3గా ఉన్న ఇండియా-B 123 రన్స్ లీడ్‌లో ఉంది.

News September 7, 2024

క్విక్ కామర్స్.. విగ్రహాలు, మామిడి ఆకులూ ఇందులోనే..

image

నగరాలు, పట్టణాల్లో క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో కొందరు వినియోగదారులు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ వినాయక చవితికి కావాల్సిన విగ్రహాలు, పత్రులు, పుష్పాలు, మామిడి ఆకులు, కుంకుమ.. ఇలా ప్రతి ఒక్క వస్తువును విక్రయించారు. వీటితో కిరాణాషాపులు, వీధి వ్యాపారులపై ప్రభావం పడుతోంది.

News September 7, 2024

నేను కాంగ్రెస్‌లో సంతోషంగా ఉన్నా: జగ్గారెడ్డి

image

TG: TPCC నూతన అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌ను నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ‘రెడ్డి వర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే జగ్గారెడ్డి చర్చలోకి వస్తాడు. నేను కాంగ్రెస్‌లో సంతోషంగానే ఉన్నా. సామాన్యుడైన మహేశ్ కుమార్‌కు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం’ అని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన వినాయకచవితి వేడుకల్లో జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పోస్టులపై తాను చర్చించనని అన్నారు.

News September 7, 2024

మండపాల్లో కరెంట్ షాక్.. నలుగురు మృతి

image

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన మండపాల్లో కరెంట్ షాక్‌తో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. APలోని రాయచోటిలో మహేశ్(13), పల్నాడులో దేవసహాయం, TGలోని కుత్బుల్లాపూర్‌లో నవీన్‌, హుజురాబాద్‌లో యశ్వంత్ మరణించారు. వేములవాడలోని కొనాయ్యపల్లిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
NOTE: వర్షాలు కురుస్తున్నందున మండపాల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కాకుండా అప్రమత్తంగా ఉండండి.

News September 7, 2024

రోహిత్‌లో గొప్పదనాన్ని ఆనాడే గుర్తించాను: స్టైరిస్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌తో కలిసి డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడిన సమయంలోనే అతడిలోని గొప్పదనాన్ని గుర్తించినట్లు మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2008 ఐపీఎల్‌లో తొలిసారిగా రోహిత్ శర్మతో కలిసి ఆడాను. అప్పటికి తనకు 19 ఏళ్లు ఉంటాయేమో. కానీ సాధారణ ఆటగాడు కాదని గుర్తించా. అద్భుతంగా ఆడేవారు. ఈ మధ్యే ఓ సిరీస్ సందర్భంగా మరోసారి కలిశాను. ఇప్పటికీ తనలో ఏ మార్పూ లేదు’ అని కొనియాడారు.

News September 7, 2024

భారత పర్యాటకులకు సౌతాఫ్రికా గుడ్‌న్యూస్

image

భారత టూరిస్టులకు దక్షిణాఫ్రికా గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో వీసా లేకుండా 90 రోజులు పర్యటించేందుకు అనుమతినివ్వనుంది. తమ టూరిస్టుల్లో అత్యధికులు భారత్, చైనా నుంచే ఉన్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత పర్యాటకుల సంఖ్య ఏటా 16వేలుగా ఉండగా, ఈ ఏడాది చివరికి దాన్ని లక్షకు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News September 7, 2024

మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి: CM

image

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు. TGలో పడే వర్షాల వల్ల APకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.

News September 7, 2024

తెలంగాణలో IPSల బదిలీలు

image

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. HYD సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News September 7, 2024

అత్యధిక సంపాదనలో విరాట్ స్థానం ఎంతంటే…

image

గడచిన ఏడాది కాలంలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం.. కోహ్లీ రూ.847 కోట్లు ఆర్జించారు. క్రిస్టియానో రొనాల్డో రూ. 2081కోట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2వ స్థానంలో స్పానిష్ గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహ్మ్(రూ.1712 కోట్లు), 3వ స్థానంలో మెస్సీ(రూ.1074 కోట్లు) ఉన్నారు.