News March 31, 2024

CUET-UG దరఖాస్తు గడువు పెంపు

image

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే CUET-UG-2024 <>దరఖాస్తు<<>> గడువును పొడిగిస్తున్నట్లు NTA ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. తెలుగు సహా 13 భాషల్లో మే 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్షను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

News March 31, 2024

నా భర్త సింహం.. జైల్లో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

image

తన భర్త సింహమని, ఆయన్ను జైల్లో ఎక్కువ కాలం ఉంచలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో తన భర్త పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరడం లేదు. కొత్త ఇండియా కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. భరతమాత బాధలో ఉంది. ప్రతిపక్ష కూటమికి ఛాన్స్ ఇవ్వండి. కొత్త ఇండియాను నిర్మిస్తాం’ అని తెలిపారు.

News March 31, 2024

అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్: దిల్ రాజు

image

త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ సినిమా చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. ‘నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా వచ్చే నాలుగేళ్లలోపు ఓ భారీ సినిమాను చేయాలనుకుంటున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని, దర్శకుడు శంకర్ ఓకే చెప్పగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

News March 31, 2024

SRHకు కీలక ప్లేయర్ దూరం!

image

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)‌కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచులకు దూరమైన హసరంగ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 31, 2024

ఫ్లై ఓవర్‌పై ఓవరాక్షన్.. రూ.36వేల ఫైన్

image

ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్‌పై ఇద్దరు ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్డు మధ్యలో కారు ఆపి రీల్స్ షూట్ చేశారు. ట్రాఫిక్ స్తంభించిపోయినా లెక్క చేయకుండా కారు డోర్ తెరిచి ప్రయాణం చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి రూ.36వేల ఫైన్ విధించారు. అయినా తగ్గని నిందితులు పోలీసులపైనా దాడికి తెగబడ్డారు. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారి కారులో కొన్ని నకిలీ ఆయుధాలను కూడా గుర్తించినట్లు సమాచారం.

News March 31, 2024

అచ్చెన్నాయుడుకు మాతృవియోగం

image

AP: టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కళావతమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు ఆమెకు నివాళులర్పించారు. కాగా ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు తెలుస్తోంది.

News March 31, 2024

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి సమయాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటుందని అంచనా వేసింది. ఎల్లుండి నుంచి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

News March 31, 2024

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది: షర్మిల

image

AP: దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ ప్రభుత్వ కుట్ర. ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. అదానీ, అంబానీల అనుచరులకు జగన్ పదవులు కట్టబెడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News March 31, 2024

టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం

image

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్‌కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు సమాన అవకాశాల్ని కల్పించడంపై కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.

News March 31, 2024

సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల

image

AP: వాలంటీర్లపై EC ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి. మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కడుపు మంటతోనే వాలంటీర్ల సేవలను EC ద్వారా నిలుపుదల చేశారని విమర్శించారు.