News March 31, 2024

పవన్‌కు మాటలెక్కువ.. వచ్చే ఓట్లు తక్కువ: వైసీపీ

image

AP: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ కళ్యాణ్ వేసిన <<12957341>>సెటైర్లకు<<>> ఆ పార్టీ Xలో కౌంటర్ ఇచ్చింది. ‘ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ అన్నట్లుగా మళ్లీ ఓడిపోయే పవన్‌కు మాటలెక్కువ, వచ్చే ఓట్లు తక్కువ. ఈసారి పొలిటికల్ పిట్టల దొరకు పిఠాపురంలో ఓటమి తప్పదు. మీ పొత్తు పార్టీలన్నీ కట్టగట్టుకుని వచ్చినా అందర్నీ మోపుకట్టి గోదారిలో నిమజ్జనం చేయడానికి ఓటర్లు సిద్ధం’ అని పేర్కొంది.

News March 31, 2024

IPL: టాస్ గెలిచిన హైదరాబాద్

image

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

News March 31, 2024

CHECK NOW.. ఫలితాలు విడుదల

image

దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. 649 JNVల్లో దాదాపు 50వేల సీట్ల వరకు అందుబాటులో ఉండగా.. ఒక్కో దానిలో గరిష్ఠంగా 80 మందికి 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు రోల్ నం, DOB ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 31, 2024

ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలే: చంద్రబాబు

image

AP: ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ పెత్తందారులు, భూస్వాముల పార్టీ. ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. జగన్ శవ రాజకీయాలు నమ్మొద్దు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. మాది పేదల పక్షం.. ప్రజలతోనే ఉంటాం. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.

News March 31, 2024

చంద్రబాబువి పిల్ల చేష్టలు: సజ్జల

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబువి పిల్ల చేష్టలు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు కడుపుమంటతో మంచి వ్యవస్థను ఆపించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ అందకుండా చేశారు. వాలంటీర్లు సీఎం జగన్‌కు మేలు చేస్తారని ఆయన భయం. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం’ అని ఆయన మండిపడ్డారు.

News March 31, 2024

మయాంక్‌పై దిగ్గజాల ప్రశంసలు

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొట్టిన మయాంక్ యాదవ్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ Xలో స్పందిస్తూ.. ‘155.8KPH స్పీడ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావ్ మయాంక్’ అని ప్రశ్నించారు. ‘మయాంక్ వేగంగా బంతి విసరడంతో పాటు లైన్ అండ్ లెంత్‌ను కొనసాగిస్తున్నారు. ఇది చూడటం ముచ్చటేస్తోంది’ అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నారు.

News March 31, 2024

రైతుకు ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్

image

TG: ‘పొలంబాట’లో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు. ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అని ఓ రైతు కేసీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అధినేత ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News March 31, 2024

పిఠాపురం ఆలయాల్లో పవన్ కళ్యాణ్ పూజలు

image

AP: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పాదగయ క్షేత్రం, కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీ వల్లభుడి ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. కాగా సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.

News March 31, 2024

ఆర్సీబీలో ఆ ఇద్దరిని పక్కనపెట్టాలి: K శ్రీకాంత్

image

గత 3 మ్యాచుల్లో విఫలమైన పాటీదార్, అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ టీమ్ పక్కనపెట్టాలని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. వారి స్థానంలో విల్ జాక్స్, ఆకాశ్ దీప్‌ను ఆడిస్తే జట్టులో సమతూకం వస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే కోహ్లీ, జాక్స్ ఇద్దరూ ఓపెనింగ్ చేయాలని, డుప్లెసిస్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని అన్నారు. జాక్స్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతారని, అతనితో 2 ఓవర్లు వేయించవచ్చని చెప్పారు.

News March 31, 2024

పాక్‌లో కటకట.. తివాచీలూ బంద్

image

ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాక్, డబ్బును ఆదా చేసుకునేందుకు దారుల్ని అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు ఎర్ర తివాచీలను వాడటాన్ని నిషేధించింది. కేవలం రాయబారులు వచ్చినప్పుడు మాత్రమే వాటిని వినియోగించాలని తేల్చిచెప్పింది. ఇప్పటికే ప్రధాని షరీఫ్ సహా కేబినెట్ అంతా తమ జీతాల్ని వదులుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.