India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన ఐపీఎల్ శాలరీ రూ.55 లక్షలతో సంతోషంగా ఉన్నానని టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ తెలిపారు. ఈ మొత్తమే తనకు ఎక్కువని చెప్పారు. ఇందుకు కేకేఆర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కాగా కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కేకేఆర్‌కు రింకూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు సాధిస్తూ ఆ జట్టు గెలుపులో భాగమవుతున్నారు.
కెన్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5-12 ఏళ్ల మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు ప్రజలు కష్టాల్లో ఉండటాన్ని చూసి రూ.5 లక్షలు విరాళమిచ్చిన ఏకైక తెలుగు హీరోయిన్ <<14015231>>అనన్య<<>> నాగళ్లను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు. దీంతో అనన్య ఉప్పొంగిపోయారు. తన అభిమాన నటుడు, తనకు స్ఫూర్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు రావడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు. పవన్ ఎప్పటికీ తనకు స్ఫూర్తి అని ఆమె ట్వీట్ చేశారు. అనన్యను చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కలకత్తా హైకోర్టు తీర్పుపై ఆయన సవాల్‌ను నేడు విచారించింది. తన హయాంలో అవినీతి, ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తననూ కక్షిదారుగా చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తిని గతంలో హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన సుప్రీంకు వెళ్లారు. ‘నిందితుడిగా ఈ పిల్‌లో మీ జోక్యానికి హక్కు లేదు’ అని CJI చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది.
TG: రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా, పథకం సజావుగా అమలయ్యేలా యాప్‌ను తయారు చేయనుంది. దీని ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయడం వంటివి సులభతరం అవుతాయని భావిస్తోంది. 18-60ఏళ్ల లోపు రైతులు ఏ కారణం వల్లనైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం ఈ పథకం కింద ₹5లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతోన్న ఇబ్బందులను తీర్చడంలో ప్రభుత్వానికి తమవంతు సాయం చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘SVC’ సంస్థలు వేరువేరుగా రూ.50 లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించాయి. ఈ పరిస్థితి నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాయి.
వాట్సాప్‌లో వాయిస్/వీడియో కాల్స్ కోసం లింక్స్ క్రియేట్ చేసే ఫీచర్ రానుంది. గ్రూప్ చాట్స్‌లో లింక్ క్రియేట్ చేసి పంపిస్తే మిగతా వారు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వొచ్చు. అంటే కాల్స్ మాట్లాడటానికి రింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాల్ యాక్టివ్‌లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా లింక్‌పై ట్యాప్ చేసి జాయిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
పారాలింపిక్స్‌లో సత్తాచాటి కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్‌కు చెందిన పరుగుల రాణి దీప్తి జీవాంజి నిజజీవితంలోనూ విజయం సాధించారు. తన చదువు, ట్రైనింగ్ కోసం కొన్నేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు ఊరిలో ఉన్న ఎకరం భూమిని అమ్మేశారు. అయితే, అందులో అరెకరం భూమిని దీప్తి తాజాగా తిరిగి కొనుగోలు చేసి తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ వెనకడుగేయకుండా పోరాడి గెలిచారు.
తాను కూడా రైతునేనని, వారి కష్టాలు తెలుసని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆయన పర్యటించారు. ‘వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. కేంద్రం తరఫున బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టించింది. ఈసారి అలా జరగకుండా చూస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,310కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.510 పెరిగి రూ.67,200 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.2,000 పెరిగి రూ.92వేలకు చేరింది.
Sorry, no posts matched your criteria.