India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి రేపు ‘మాట వినాలి’ పాట విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. సాంగ్ రిలీజ్ కోసం త్వరలో మరో డేట్‌ను ప్రకటిస్తామని మూవీ టీమ్ తెలిపింది. బెస్ట్ వెర్షన్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకే సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలిపింది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

AP: విజయవాడలో జరుగుతోన్న హైందవ శంఖారావంలో విశ్వహిందూ పరిషత్ (VHP) డిక్లరేషన్ ప్రకటించింది.
*ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి.
*ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి.
*హిందూ ధర్మం పాటించేవాళ్లనే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి
*దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు.
*వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు సరికాదు.

HYD పరిధిలోని చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ రేపు ఉ.10:30కి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రూ.428 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో దీనిని అభివృద్ధి చేశారు. 25 జతల రైళ్లు నడిచేలా మొత్తం 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ వంటివి ఉంటాయి.

జో బైడెన్ నిర్ణయాలపై ఎలాన్ మస్క్ మరోసారి విరుచుకుపడ్డారు. బిలియనీర్ జార్జ్ సోరోస్‌ను Presidential Medal of Freedomతో గౌరవించడం హాస్యాస్పదం అని విమర్శించారు. ప్రజాస్వామ్య బలోపేతం, మానవ హక్కులు, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మెడల్‌కు ఎంపిక చేసినట్టు వైట్ హౌస్ తెలిపింది. అయితే, ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని రిపబ్లికన్స్ మండిపడుతున్నారు.

TG: ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని PCC చీప్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలబడిందని తెలిపారు. BRS ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, రూ.7 లక్షల కోట్ల అప్పులతో ఉన్న టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.22 వేల కోట్లతో రుణమాఫీ చేశామని, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.

కొంత మోతాదులో మద్యపానంతో ప్రమాదం లేదన్న ప్రచారాలను <

ప్రపంచంలో ఇప్పటికీ 5 దేశాల్లో ఎయిర్‌పోర్ట్ లేదు. స్థలాభావం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ విమానాశ్రయాలను నిర్మించలేదు. వాటికన్ సిటీలో ఎయిర్‌పోర్ట్ లేదు. ఇక్కడికి సమీపంలోని రోమ్ (ఇటలీ) విమానాశ్రయం నుంచి చేరుకుంటారు. లీచ్‌టెన్‌స్టెయిన్ దేశ ప్రజలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌ను ఆశ్రయిస్తారు. అండోరా, మొనాకో, శాన్ మారినో దేశాల ప్రజలు పక్క దేశాల్లోని విమానాశ్రయాల నుంచి చేరుకుంటారు.

సినీ నటుడు ప్రభుకు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. డిశ్చార్జ్ అయిన ఆయన ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని ఆయన PRO వెల్లడించారు. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరగా, మెదడులోని ఓ ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభు తమిళ, తెలుగు, హిందీ, మలయాళంలో కలిపి దాదాపు 220 సినిమాల్లో నటించారు.

AP: మంత్రి నారా లోకేశ్ సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని YCP నేత తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోకేశ్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలని నిలదీశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దోపిడీ పెరిగిపోయింది. కూటమి నేతలు చెప్పే మాటలకు, పనులకు పొంతన ఉందా? ఇప్పటివరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?’ అని ఆయన ప్రశ్నించారు.

ICC టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా (14) రికార్డు సృష్టించింది. తాజాగా WTC ఫైనల్ చేరుకోవడంతో ఈ ఘనతను సాధించింది. ఈ లిస్టులో రెండో స్థానంలో భారత్ (13), తర్వాతి స్థానాల్లో వరుసగా ENG (9), WI (8), SL (7) ఉన్నాయి. జూన్ 11 నుంచి SAతో జరిగే WTC ఫైనల్‌లో గెలిస్తే వరుసగా రెండు సార్లు WTC గెలిచిన జట్టుగా ఆసీస్ నిలవనుంది. గత WTC (2021-23) ఫైనల్‌లో INDపై AUS గెలిచిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.