India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వరద బాధిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ప్రతి ఇంటికీ ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి వారు ఇష్టానుసారం వసూలు చేయకుండా చూస్తాం. ఒక ధర నిర్ణయిస్తాం. అవసరమైతే రాయితీ ఇస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తాం’ అని తెలిపారు.
AP: ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్‌కు లేఖ పంపారు. జిల్లా అభివృద్ధి కోసం తాము జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ దంపతులు, 19 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడిన విషయం తెలిసిందే.
TG: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7వేల ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలిన ఇళ్లలో ఎక్కువగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్థలం ఉంటే ₹5లక్షలు, లేని వారికి స్థలం+₹5లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
విజయవాడను నిండాముంచిన బుడమేరు వాగును బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆక్రమణలు తొలగించి వాగును విస్తరించడం, ప్రకాశం బ్యారేజీకి వెళ్లే డైవర్షన్ ఛానల్ కెపాసిటీని పెంచడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే కొల్లేరు మంచినీటి సరస్సు పరీవాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఆక్రమణలు పెరిగాయి. బుడమేరు నీరు దాంట్లోకి వెళ్లకపోవడం కూడా విజయవాడ వరదలకు ఓ కారణంగా చెబుతున్నారు నిపుణులు.
కొందరికి ఉదయం లేవగానే కాఫీ కావాల్సిందే. అయితే, సరైన సమయంలో కాఫీ తాగితే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే కాకుండా కాస్త లేటుగా 9.30 నుంచి 11.30 గంటల లోపు కాఫీ తాగడం ఉత్తమమని సూచించారు. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయులు నియంత్రణలో ఉంటాయన్నారు. శరీరంలోని సహజ హార్మోన్‌లు మరింత స్థిరంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు.
AP: వర్షాలు తగ్గినా లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, విద్యాసంస్థలు కొనసాగనున్నాయి.
AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమని తేల్చింది. 16జిల్లాల్లో 4.53లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12జిల్లాల్లో 48,632ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి. వరి, పత్తి, కంది, పెసర, వేరుశనగతోపాటు మిర్చి, అరటి, పసుపు, కంద, నిమ్మ పంటలకు నష్టం జరిగింది.
TG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వంటి 9 రకాల సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ల లభ్యతను బట్టి ఒక్కో రోజు ఒకటి లేదా రెండు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. దీని కోసం గ్రామాల్లోకి వెళ్లి పనిచేసే డాక్టర్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇవ్వనుంది. PHCలలో బేసిక్ టెస్టులు చేసి, సర్జరీలకు జిల్లా ఆస్పత్రులకు పంపిస్తారని సమాచారం.
AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు, రవాణా రంగానికి ₹35.50 కోట్లు, పర్యాటక రంగానికి ₹20 కోట్ల నష్టం జరిగింది. విజయవాడ డివిజన్‌లో రైల్వే శాఖ ₹30 కోట్ల ఆదాయం కోల్పోయింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి AP, TGలో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ బీమా సంస్థలను కేంద్రం ఆదేశించింది. క్లెయిమ్స్ పరిష్కారం కోసం పాలసీదారులు సంప్రదించాల్సిన నోడల్ ఆఫీసర్ల పేర్లు, ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.