India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: భూభారతి చట్టంపై మాట్లాడుతుంటే తనపై దాడి చేసేలా BRS నేతలు ప్రవర్తించారని మంత్రి పొంగులేటి అన్నారు. మంచి చట్టాలకు మద్దతు తెలపకుండా కుక్క తోక వంకర అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభను ఏదోలా అడ్డుకునేందుకే BRS ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. అటు, భూభారతి బిల్లుపై మాట్లాడాలని స్పీకర్ BRS సభ్యులను కోరగా.. ఈ కార్ రేసుపై చర్చ జరపాలని వారు పట్టుబట్టి నిరసనకు దిగారు.

భారత్‌లో నిబంధనల్ని మరింత కఠినతరం చేయాలని యూట్యూబ్ నిర్ణయించింది. తప్పుదోవ పట్టించే టైటిల్స్, థంబ్‌నెయిల్స్‌తో ఉండే వీడియోలను క్లిక్ బెయిట్‌గా పరిగణించి తొలగిస్తామని స్పష్టం చేసింది. వినియోగదారులకు మంచి కంటెంట్ అందించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. వీడియోపై పెట్టిన థంబ్‌నెయిల్, టైటిల్‌కు తగ్గట్టుగానే వీడియోలు ఉండాల్సి ఉంటుందని కంటెంట్ క్రియేటర్లకు తేల్చిచెప్పింది.

లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సభ పంపింది. ఇద్దరు బీజేపీ ఎంపీలు తోపులాటలో గాయపడిన నేపథ్యంలో అధికార, విపక్షాలు ఒకదాన్నొకటి విమర్శించుకోవడంతో రోజంతా హైడ్రామా నడిచింది. అటు రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా పడింది.

అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అటు కడప, నెల్లూరు, తిరుపతి, విశాఖ, నరసాపురం, ఒంగోలు, కావలి సహా పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

TG: ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు నమోదు చేయడంపై KTR హైకోర్టును ఆశ్రయించారు. తనపై ACB కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

TG: అసెంబ్లీలో గందరగోళం నెలకొనగా సీఎం రేవంత్ రెడ్డి సభలో పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్‌పై వేశారని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

TG: BRS కోతి చేష్టలను రాష్ట్ర సమాజం గమనిస్తోందని MLA వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్‌ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని BRS వ్యవహరిస్తోందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి పైకి దూసుకొచ్చారని తెలిపారు. అటు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని BRS మండిపడుతోంది.

TG: ఫార్ములా ఈ-రేస్ కేసుపై తెలంగాణ ఏసీబీని ఈడీ ఆరా తీసింది. ఈ వ్యవహారంపై ACB నుంచి ED అధికారులు FIR సహా పలు పత్రాలు కోరినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలు రావడంతో రెగ్యులర్ ప్రాసెస్‌లో భాగంగా ED ఆరా తీసింది. డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత KTRపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకోనుంది.

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి KTRను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ACB కేసు నమోదు చేసింది. విచారణ కోసం ACB టీమ్‌నూ సిద్ధం చేసింది. దీంతో ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. నిందితులకు తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టు చేస్తారని కొన్ని మీడియా సంస్థలు, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తారని మరికొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి.

విభిన్న సినిమాలు తీసే ఉపేంద్ర ‘UI’లో వన్ మ్యాన్ షో చేశారని ప్రేక్షకులు అంటున్నారు. మూవీలో కల్కి భగవాన్ వర్సెస్ హీరోకు మధ్య సాగే సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే మూవీ అస్సలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. ప్రయోగాలు ఇష్టపడే వారికే మూవీ నచ్చుతుందట. మరికొద్దిసేపట్లో WAY2NEWS రివ్యూ.
Sorry, no posts matched your criteria.