India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వింబుల్డన్(టెన్నిస్) మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టాప్ సీడ్ సిన్నర్‌కు ఐదో సీడ్ మెద్వెదెవ్ షాకిచ్చారు. హోరాహోరీగా సాగిన మ్యాచులో 6-7, 6-4, 7-6, 2-6, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మరో మ్యాచులో పాల్‌పై మూడో సీడ్ అల్కరాజ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగే క్వార్టర్స్‌లో జకోవిచ్-మినార్, ముసెట్టి-ప్రిట్జ్ మధ్య పోరు జరగనుంది.
ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి పంద్రాగస్టు వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాల గురించి వివరణ, విద్యార్థులకు సెమినార్లు, పోటీల వంటివి నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతుంది.
AP: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)కు ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ప్రభుత్వంలో కీలకమైన సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏడేళ్ల సర్వీస్ ఉండగానే VRSకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లలో నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఈ ఏడాది బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 189 KM ORRకు రూ.25వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈ సారి బడ్జెట్‌లో రూ.5-10వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ORRను 6 లేన్లతో ఎక్స్‌ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు.
TG: డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడాలని TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. అలా అయితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగానే ఉన్నామని చెప్పారు. మరోవైపు డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
TG: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురవగా అత్యధికంగా ఖమ్మం(D) గంగారంలో 6.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
TG: రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడు జారీ కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది.
యూరో ఛాంపియన్ షిప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముందుగా ఫ్రాన్స్ గోల్స్ ఖాతా తెరిచినప్పటికీ తర్వాత స్పెయిన్ జట్టు దూకుడు కొనసాగింది. కేవలం 4 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసి ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరివరకు ఇదే జోరు కొనసాగించడంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ అర్ధరాత్రి 12:30 గంటలకు నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మధ్య మరో సెమీస్ జరగనుంది.
TG: గ్రూప్-4లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు HYD కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలని TGPSC తెలిపింది. వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు తదితర వివరాల కోసం <
AP: ఏపీ కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ సహా పలు కీలక అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆయా అంశాల సమాచారాన్ని సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక సీఎస్‌లు, పీఎస్‌లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.