News December 20, 2024

భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్

image

పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్-2025 ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌ను భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి. SEP 26 నుంచి OCT 5 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో 100 దేశాల నుంచి 1000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రతిపాదనను ఇది బలపరుస్తుందని NPC ఇండియా అభిప్రాయపడింది. మార్చి 11-13 వరకు వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌కు కూడా ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.

Similar News

News January 17, 2025

ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

image

AP: పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

News January 17, 2025

ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు: షర్మిల

image

AP: ‘ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ తీరుగా CBN వ్యవహారం ఉందని APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించని మోదీతో పొత్తు ఎందుకని Xలో నిలదీశారు.

News January 17, 2025

రక్తం కారుతున్నా సైఫ్ సింహంలా వచ్చారు: వైద్యులు

image

దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర రక్తస్రావమైనా స్ట్రెచర్ ఉపయోగించలేదని ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమారుడితో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రక్తం వస్తున్నా ‘ఒక సింహంలా, రియల్ హీరోలా’ నడుచుకుంటూ వచ్చారని చెప్పారు. వెన్నెముకలో కత్తి మరో 2 MM లోపలికి దిగి ఉంటే సీరియస్ ఇంజురీ అయి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి పక్షవాతం వచ్చే అవకాశం లేదని, క్షేమంగా ఉన్నారని వివరించారు.