India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సభలో ప్రవేశపెట్టబోయే పురపాలక, GHMC, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆయా బిల్లులకు BRS తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నట్లు, తమ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన మీడియా చిట్ చాట్‌లో అన్నారు. అవసరమైతే సభలో డివిజన్‌కు పట్టుబడతామని చెప్పారు.

రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి రూ.85కు చేరుకుంది. దేశీయంగా వస్తు, సేవల దిగుమతికి $ అవసరాలు పెరిగాయి. పోర్ట్‌ఫోలియో అడ్జస్ట్‌మెంట్ వంటి వాటికోసం విదేశీ బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్‌ను పోగేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఔట్‌ఫ్లోతో దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ఈ కారణల వల్ల డాలర్ బలపడుతుండడంతో రూపాయి విలువ తగ్గిపోతోంది.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలపై క్యాబినెట్ అజెండా రూపొందించగా, వాటిపై మంత్రులు చర్చిస్తున్నారు. సీఆర్డీఏ అనుమతించిన పనులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అటు, అమరావతిలో భాగస్వామ్యం కావాలని సీఆర్డీఏ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలకు లేఖల ద్వారా ఆహ్వానం పలికింది.

AP: పరిపాలనా, నివాస భవనాలు, పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం అభివృద్ధి కాదని మాజీ MP హరిరామజోగయ్య అన్నారు. రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒకే ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని బహిరంగ లేఖ విడుదల చేశారు.

హీరోయిన్ రష్మిక మందన్నతో డేటింగ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడే నేనూ బయటపెడతా. దీని కోసం ఓ సందర్భం రావాలి. నేను ఒక నటుడిని కావడంతో నా జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు’ అని చెప్పారు.

AP: 99% మంది హెల్మెట్లు లేకుండా బైకులు నడుపుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల దాఖలైన పిల్ విచారణకు రాగా హైకోర్టు స్పందిస్తూ.. ‘బైక్ నడిపే వ్యక్తే కాకుండా, వెనక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలి. నిబంధనలు పాటించని వారికి ఫైన్ వేసి, 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలి. పత్రికలు, టీవీలు తదితర చోట్ల ప్రకటనలివ్వండి’ అని వ్యాఖ్యానించింది. ఆపై విచారణ 3వారాలు వాయిదా పడింది.

బ్యాంకింగ్ దిగ్గజం SBI ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం SBI డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు MDగా బాధ్యతలు స్వీకరిస్తే SBI చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది.

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వీటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కో-ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనుంది. ప్రస్తుతం 475 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున జూ.కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 190 మండలాల్లో కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా తీసుకునే కాంట్రాక్టు లెక్చరర్లను వీటిలో నియమించనున్నట్లు సమాచారం.

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం Sensex 960 పాయింట్ల నష్టంతో 79,207 వద్ద, Nifty 300 పాయింట్లు కోల్పోయి 23,900 వద్ద కదులుతున్నాయి. Pre-Open Marketలో IT షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, FMCG, మెటల్, ఫార్మా సహా అన్ని కీలక రంగాలు ఒక శాతానికిపైగా నష్టపోయాయి. India Vix 15.14గా నమోదవ్వడం సెల్లింగ్ ప్రెజర్‌కు అద్దంపడుతోంది.

AP: మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తూ.గో జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.95.85 లక్షలతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఇందులో మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో బంకులు ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.