News December 19, 2024

జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపాయి

image

రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి రూ.85కు చేరుకుంది. దేశీయంగా వ‌స్తు, సేవ‌ల దిగుమ‌తికి $ అవసరాలు పెరిగాయి. పోర్ట్‌ఫోలియో అడ్జ‌స్ట్‌మెంట్ వంటి వాటికోసం విదేశీ బ్యాంకులు పెద్ద ఎత్తున డాల‌ర్‌ను పోగేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్ట‌ర్ల పెట్టుబ‌డుల ఔట్‌ఫ్లోతో దేశీయ ఈక్విటీ మార్కెట్ న‌ష్టాల్లో ప‌యనిస్తోంది. ఈ కార‌ణల వ‌ల్ల డాల‌ర్ బ‌ల‌ప‌డుతుండ‌డంతో రూపాయి విలువ త‌గ్గిపోతోంది.

Similar News

News January 19, 2025

ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

image

TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.

News January 19, 2025

సైఫ్‌పై దాడిని అంగీకరించిన నిందితుడు

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది తానేనని <<15192921>>థానేలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి<<>> అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడిని రెస్టారెంట్లో పనిచేసే మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్‌గా గుర్తించారు. చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నిందితుడు కాదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వివరాలను ఉ.9గంటలకు డీజీపీ ఆఫీసులో మీడియాకు వెల్లడిస్తామన్నారు.

News January 19, 2025

కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని ట్విస్ట్

image

కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడట్లేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని హెచ్చరించారు.