News March 27, 2024

చరణ్ బర్త్ డే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుడ్ పంపిణీ

image

రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఘనంగా చేసుకున్నారు. ‘డార్లింగ్ ఫ్యాన్స్ తరఫున ప్రియమైన చరణ్ కోసం’ అని పిల్లలకు ఫుడ్ పంపిణీ చేశారు. ఫుడ్ బాక్సులపై చరణ్, ప్రభాస్ కలిసి ఉన్న ఫొటోతో పాటు ‘హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ అని ముద్రించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చరణ్ అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. మన హీరోలే కాదు మనం కూడా ఫ్రెండ్స్ అని చెర్రీ ఫ్యాన్స్ అంటున్నారు.

News March 27, 2024

జనసేన తరఫున ప్రచారానికి రెడీగా ఉన్నా: అనసూయ

image

రాజకీయాలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా. వాళ్ల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా. జనసేన లీడర్ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News March 27, 2024

18 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

image

ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ ముగిసింది. సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో 18 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈనెల 31న మరోసారి సీఈసీ భేటీ కానుంది. ఆ తర్వాతే కాంగ్రెస్ మలివిడత ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 27, 2024

చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

image

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలోనే 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో 148 పరుగులు బాదిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాత ముంబై 131/3 (2021), పంజాబ్ 131/3 (2014), డెక్కన్ ఛార్జర్స్ 130/0 (2008), బెంగళూరు 129/0 (2016), బెంగళూరు 128/0 (2013), లక్నో 128/2 (2023), చెన్నై 128/2 (2015) ఉన్నాయి.

News March 27, 2024

IPLలో ఫాస్టెస్ట్ 50 చేసిన క్రికెటర్లు

image

1. యశస్వీ జైస్వాల్(RR) – 13బంతుల్లో(2023లో KKRపై)
2. కమిన్స్(KKR) – 14బంతుల్లో(2022లో MIపై)
3. KL రాహుల్(PBKS) – 14బంతుల్లో(2018లో DDపై)
4. నరైన్(KKR) – 15బంతుల్లో(2017లో RCBపై)
5. యూసుఫ్ పఠాన్(KKR) – 15బంతుల్లో(2014లో SRHపై)
6. పూరన్(LSG) – 15బంతుల్లో(2023లో RCBపై)
7. రైనా(CSK) – 16బంతుల్లో(2014లో PBKSపై)
8. అభిషేక్(SRH) – 16బంతుల్లో(2024లో MIపై)

News March 27, 2024

SRH ఎంత స్కోర్ చేస్తుందంటారు?

image

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఉప్పెనలా చెలరేగుతున్నారు. దీంతో 13ఓవర్లలోనే 180 రన్స్ చేసేసింది. హెడ్(62) అల్లాడిస్తే, అభిషేక్(63) షేక్ చేశారు. క్రీజులో మరో డేంజరస్ బ్యాటర్ క్లాసెన్ ఉన్నారు. SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News March 27, 2024

సమ్మర్‌లో వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

image

వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. వేడి నీళ్లు మురికి, బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. వేడి నీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి కణాల్లో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదల, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. ఒత్తిడి తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

News March 27, 2024

IPL: అభిషేక్ వీర విధ్వంసం.. 16 బంతుల్లో 50

image

ముంబైతో జరుగుతున్న మ్యాచులో SRH ప్లేయర్లు వీర విధ్వంసం సృష్టిస్తున్నారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో 50 రన్స్‌తో చెలరేగారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 2 ఫోర్లున్నాయి. IPLలో SRH తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఇదే మ్యాచులో కొద్దిసేపటి క్రితమే హెడ్(18 బంతుల్లో 50) రికార్డును అభిషేక్ బద్దలుకొట్టారు.

News March 27, 2024

SRH ప్లేయర్ల ఊచకోత

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ ప్లేయర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బౌలర్‌ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో SRH కేవలం 7 ఓవర్లలోనే 102* పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులతో విధ్వంసం సృష్టించారు. మరో బ్యాటర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లోనే 32* రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

News March 27, 2024

క్షమించండి: సీఎం జగన్

image

AP: ఇటీవల సీఎం జగన్ సభల్లో ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సభలో ప్రసంగించిన తర్వాత జగన్ ప్రజలను క్షమించమని కోరారు. ‘చీకటి పడింది కాబట్టి సెక్యూరిటీ వాళ్లు ర్యాంప్ వాక్ వద్దంటున్నారు. ఈసారికి క్షమించమని అడుగుతున్నా’ అని కోరారు. ఇక ప్రతి ఇంటికీ సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలని ఆయన పిలుపునిచ్చారు.