India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెస్టు మ్యాచ్‌లో కొత్త బంతిని ఆడేందుకు విరాట్ కోహ్లీ టెక్నిక్ సరిపోదని పూజారా అభిప్రాయపడ్డారు. ‘టాప్ ఆర్డర్ త్వరగా ఔట్ కావడం వల్ల విరాట్ కొత్త బంతిని ఆడాల్సి వస్తోంది. అతడి టెక్నిక్ కొత్త బంతిని ఆడేందుకు సరైనది కాదు. పెర్త్‌లో పాతబంతిపై సెంచరీ చేయగలిగారు. 20 ఓవర్ల తర్వాతే ఆయన బ్యాటింగ్‌కు రావాలి. ఆఫ్‌స్టంప్ ఆవల వెళ్లే బంతిని ఆడాలన్న తహతహను కంట్రోల్ చేసుకోవాలి’ అని సూచించారు.

1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
1959: నటి జయసుధ జననం
1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
1985: నటుడు అడివి శేష్ జననం
1996: సినీ నటి సూర్యకాంతం మరణం (ఫొటోలో)

తేది: డిసెంబర్ 17, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
అసర్: సాయంత్రం 4.09 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
ఇష: రాత్రి 7.03 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తిథి: బహుళ విదియ మ.12:30 వరకు
✒ నక్షత్రం: పునర్వసు తె.3.01 వరకు
✒ శుభ సమయం: మ.12 నుంచి మ.1 గంటల వరకు
✒ రాహుకాలం: మ.3:00 నుంచి సా.4:30 వరకు
✒ యమగండం: ఉ.9:00 నుంచి ఉ.10:30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి ఉ.9.12 గంటల వరకు
తిరిగి రా.10.48 నుంచి రా.11.36 గంటల వరకు
✒ వర్జ్యం: మ.2.22 నుంచి మ.3.58 గంటల వరకు
✒ అమృత ఘడియలు: రా.12.26 నుంచి రా.2.04 వరకు

TG: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ
TG: మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి
AP: 2026 OCT నాటికి పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
AP: చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ఆలస్యం: అంబటి
☛ రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు
☛ మూడో టెస్ట్: భారత్ స్కోర్ 51/4

ముఖేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నట్లే బంగ్లాదేశ్‌లోనూ ఓ ధనికుడు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆస్తి మాత్రం పెరుగుతూ వస్తోంది. ఆయనెవరో కాదు DATCO గ్రూప్ వ్యవస్థాపకుడు ముసా బిన్ షంషేర్. ఆయన నికర ఆదాయం $12 బిలియన్లు (రూ. 99,600 కోట్లు). ఈయన మాజీ ప్రధాని హసీనా కంటే 40వేల రెట్లు సంపన్నుడు. DATCO కంపెనీ ముఖ్యంగా ఆయుధాల వ్యాపారానికి ప్రసిద్ధి.

టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్య వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన మరణ వాంగ్మూలంలో ఆరోపించారు. ఇదిలా ఉండగా.. జంబో కింగ్ ఔట్‌లెట్ అతడికి తమ బిల్లుల్లో నివాళులర్పించింది. ‘సుభాష్ మృతి చాలా బాధాకరం. అందరి జీవితంలాగే అతడి జీవితమూ చాలా విలువైనది. RIP బ్రదర్. నీ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నాం’ అని బిల్లులపై ముద్రించింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆనంద్ యాదవ్‌కు పిల్లల్లేరు. పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తంత్రకుడిని సంప్రదించాడు. అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మరణించాడు. పోస్టుమార్టమ్‌లో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు. ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

1971లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసి అప్పటి తూర్పు పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరోజును ‘విజయ్ దివస్’గా భారత్ ఏటా గుర్తుచేసుకుంటోంది. ఈరోజు PM మోదీ చెప్పిన శుభాకాంక్షల్ని బంగ్లాలోని యూనస్ సన్నిహితులు తప్పుబట్టారు. తాము చేసిన పోరాటంలో భారత్ ఏదో కొద్దిగా సాయం చేసిందని, నేడు భారత్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. వీరిలో యూనస్ సలహాదారు నజ్రుల్ కూడా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.